SFA Championships 5th day: హైదరాబాద్ వేదికగా SFA ఛాంపియన్‌షిప్ పోటీలు.. ఐదో రోజు ఆకట్టుకున్న ‘షీ ఈజ్ గోల్డ్ డే’ థీమ్
హైదరాబాద్ లో జరుగుతున్న SFA ఛాంపియన్‌షిప్ పోటీలు ఐదో రోజు ఆసక్తికరంగా సాగాయి. క్రీడల్లో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ సమానత్వాన్ని లోకానికి చాటేలా వినోద కార్యక్రమాలు జరిగాయి. నేటి పోటీల్లో పలువురు బాలబాలికలు పాల్గొని ఉత్సహంగా ఆటలు ఆడారు..
హైదరాబాద్, అక్టోబర్ 21: దేశంలోని యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు తమ ప్రదర్శనకు సరైన వేదికను అందించేందుకు TV9 నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన SFAతో జతకట్టింది. ఇది ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ వేదిక ద్వారా యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల ప్రదర్శనకు క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా 12 నుండి 17 సంవత్సరాల మధ్య వయసున్న యువ క్రీడాకారులకు అవకాశాలను అందించడంపై దృష్టి సారించింది. దేశంలోని యువ ప్రతిభను గుర్తించేందుకు బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPOతో సహా పలు సంస్థలతో న్యూస్9 అనుసంధానం అయ్యింది. ఈ ఛాంపియన్‌షిప్ విజేతలను 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరిస్తారు.
SFA ఛాంపియన్‌షిప్ 2024లో భాగంగా 5వ రోజున స్పోర్ట్స్‌లో మహిళల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేలా ‘షీ ఈజ్ గోల్డ్ డే’ అండ్ ‘కోచ్ డే’ థీమ్‌తో సెలబ్రేట్ చేశారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కోచ్‌లు పోషించే కీలక పాత్రను హైలెట్ చేశారు. ఈ రోజు జరిగిన పోటీల్లో 80 శాతానికి పైగా మహిళా అథ్లెట్లు పాల్గొన్నారు. ఛాంపియన్‌షిప్ క్రీడలలో లింగ సమతుల్యత దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని పలు స్టేడియంలలో ఈ పోటీలు జరిగాయి. ఐదవ రోజు గచ్చిబౌలి స్టేడియంలో మహిళా అథ్లెట్లు వారి కోచ్‌లతో పాటు ఈ ఛాంపియన్‌షిప్ వినోద కార్యక్రమ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లందరూ తమ క్రీడా కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించేందుకు గూడీ బ్యాగ్‌లను అందించారు. హాకీ అండర్-14 బాలికల విభాగంలో విఘ్నన్స్ బో ట్రీ స్కూల్ (నిజాంపేట్) విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకుంది. ఇక రోజంగా ఉత్సాహంగా పోటీలు జరిగాయి. చెస్‌లో అండర్-7 బాలుర విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఖాజాగూడు)కి చెందిన శ్రేయాన్ష్ తుమటి పసిడి పతకాన్ని సాధించగా, U-14 త్రోబాల్ బాలికల విభాగంలో CGR ఇంటర్నేషనల్ స్కూల్ CBSE, హైటెక్ సిటీ విజేతలుగా నిలిచాయి. ఖోఖోలో ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ టీమ్ అండర్-18 ఫిమేల్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఇక శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో అండర్-13 కరాటే కుమిటే బాలికల విభాగంలో విజయ హైస్కూల్ (సాకేత్)కు చెందిన అంజలి కుమ్మవైనా బంగారు పతకం సాధించింది.
శ్రీరామ్ స్కేటింగ్ రింక్‌లో స్కేటింగ్ ఈవెంట్‌లు ప్రధాన వేదికగా నిలిచాయి. ఇక్కడ క్రీడాకారులు ఆకట్టుకునే వేగం, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 500 మీటర్ల ఇన్‌లైన్ ఫైనల్స్‌లో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్‌ఇకి చెందిన ధృవ పుతుంబక U-09 బాలుర విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. క్వాడ్‌లు, ఇన్‌లైన్ ఫైనల్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో టెన్నిస్ పోటీలు జరిగాయి. బాలికల అండర్-12 సింగిల్స్‌లో మహర్షి విద్యా మందిర్ (కొండాపూర్)కి చెందిన కాశిక కర్ణం స్వర్ణం సాధించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ పోటీల్లో U-16 బాలికల విభాగంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ (బొలారం) స్వర్ణం సాధించింది. 5వ రోజున DDMS AMS P.Obul Reddy Public School పాఠశాల లీడర్‌బోర్డ్‌లో పోటీల్లో ఆగ్రస్థానంలో నిలిచింది.