AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Network-SFA Championships: ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. SFAతో జతకట్టిన టీవీ9 నెట్‌వర్క్..

బుండేస్లిగా , డీఎఫ్‌బీ-పోకల్‌ సౌజన్యంతో టీవీ9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ హంట్ లో భాగంగా దేశవ్యాప్తంగా 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసి జర్మనీ , ఆస్ట్రియాలో ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తారు. ఇది భారత ఫుట్‌బాల్‌ దిశ, దశను మార్చడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.

TV9 Network-SFA Championships: ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. SFAతో జతకట్టిన టీవీ9 నెట్‌వర్క్..
SFA - Tv9 Sports
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2024 | 5:19 PM

Share

మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీయడానికి టీవీ9 నెట్ వర్క్ మహా యజ్ఞాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ టాలెంట్‌ను బయటకు తీసుకురావడానికి ఇండియన్‌ టైగర్స్‌, టైగ్రెసెస్‌.. టాలెంట్‌ హంట్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.. ఇండియన్‌ టైగర్స్‌ , టైగ్రెసెస్‌.. టాలెంట్‌ హంట్‌తో 20 మంది బాలురు.. 20 మంది బాలికలను ఎంపిక చేసి ఆస్ట్రియ , జర్మనీలో శిక్షణ ఇస్తారు. TV9 నెట్‌వర్క్ “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్” ఈ విప్లవాత్మక ప్రచారం కోసం భారతదేశంలోని అతిపెద్ద గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన SFAతో జతకట్టింది. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ తోపాటు.. స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) సంయుక్తంగా దేశంలోని వర్ధమాన ఫుట్‌బాల్ క్రీడాకారులకు చేయూత అందించడంతోపాటు.. అత్యుత్తమ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉమ్మడి లక్ష్యంతో పయనిస్తున్నాయి..

టీవీ9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ ప్రచారం కోసం.. 12 నుంచి 14 సంవత్సరాలు.. 15 నుంచి 17 సంవత్సరాల బాల బాలికలకు అవకాశాలను అందించడంపై దృష్టి సారించే అద్భుతమైన టాలెంట్ హంట్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది..

Sfa 2024

భారతదేశంలోని నంబర్ 1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 – News9 “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్”.. ఒక మార్గదర్శక చొరవ.. బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPOలతో కలిసి.. ఫుట్ బాల్ లో ప్రతిభ గల బాలురు, బాలికలను గుర్తించడానికి టీవీ9 పనిచేస్తోంది. టాప్-క్లాస్ స్కౌటింగ్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని ప్రతిభావంతులైన యువకులను భాగస్వామ్యం చేస్తోంది.. దీనిలోని విజేతలను 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరించడంతోపాటు.. ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని జరుగుతున్న SFA ఛాంపియన్‌షిప్స్ 2024 ద్వారా టీవీ9 మరో సువర్ణావకాశాన్ని అందించనుంది.. TV9 నెట్‌వర్క్ ఫుట్‌బాల్ విప్లవంలో భాగంగా SFA తో జతకట్టింది.. హైదరాబాద్‌లోని వేలాది మంది యువతీ యువకులకు SFAతో కలిసి టీవీ-9 ఒక సువర్ణావకాశాన్ని అందింనుంది..

Sfa Hyd

“ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్” టాలెంట్ హంట్ కు హైదరాబాదు నగరంలోని బాలబాలికలు ఆసక్తికనబరిస్తున్నారు. SFA బ్యాండ్‌వాగన్‌లో బాలబాలికలు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫ్లాగ్ మార్చ్ చేశారు.

ఊపందుకున్న SFA ఛాంపియన్‌షిప్‌ 2024..

SFA ఛాంపియన్‌షిప్స్ 2024 4వ రోజు గచ్చిబౌలి స్టేడియంలో ఫ్లాగ్ ఆఫ్ వేడుకతో ఉత్సాహంగా ప్రారంభమైంది. సంక్తా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ (గచ్చిబౌలి), విగ్నన్స్ బో ట్రీ స్కూల్ (నిజాంపేట్), శాంటినోస్ గ్లోబల్ స్కూల్ (మీర్‌పేట్), సెంటియా ది గ్లోబల్ స్కూల్ (మియాపూర్), CGR ఇంటర్నేషనల్ స్కూల్ CBSE (హైటెక్ సిటీ), ది గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ (కోకాపేట్) వంటి కొన్ని ప్రముఖ పాఠశాలలు.. మొత్తం ఆరు పాఠశాలలు తమ పాఠశాల జెండాలను ప్రదర్శించి ఉత్సాహపూరితమైన పోటీకి సిద్దమయ్యాయి..

యూసుఫ్‌గూడలో జరిగిన U-15 పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ రౌండ్ 1లో యువ క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. కటా అండర్-15 బాలికల విభాగంలో కరాటేలో తమన్నా ప్రమాణిక్ బంగారు పతకం సాధించి సత్తా చాటింది..

Sfa Tv9

శ్రీరామ్ స్కేటింగ్ రింక్‌లో అండర్-17 బాలికల 1000 మీటర్ల ఇన్‌లైన్ విభాగంలో విఘ్నన్స్ బో ట్రీ స్కూల్ (నిజాంపేట)కు చెందిన చరిత శ్రీ మండిపూడి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 500 మీటర్ల క్వాడ్స్‌లో అండర్‌-17 బాలుర విభాగంలో రెయిన్‌బో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (బీరంగూడ)కు చెందిన నందకిషోర్‌ తిర్లంగి స్వర్ణం సాధించగా, అండర్‌-14 బాలికల విభాగంలో భాష్యం హైస్కూల్‌ (కూకట్‌పల్లి)కి చెందిన అమృత గోరంట్ల మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

గచ్చిబౌలి స్టేడియంలో రంగుల ఫ్లాగ్-ఆఫ్ వేడుక తర్వాత.. ఫుట్‌బాల్, త్రోబాల్, ఖో ఖో, బాస్కెట్‌బాల్ ప్రారంభ రౌండ్‌ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగాయి.

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం బాలుర U-10 సింగిల్స్ టెన్నిస్ క్వార్టర్‌ఫైనల్స్‌లో యంగ్ గన్స్ సెమీ-ఫైనల్‌లో స్థానం కోసం పోరాడుతోంది. 4వ రోజు ముగిసే సమయానికి, పల్లవి మోడల్ స్కూల్ (బోడుప్పల్) 4 ర్యాంకులు దిగజారగా.. DDMS AMS P.Obul Reddy Public School లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.. రెండో స్థానంలో శాంటినోస్ గ్లోబల్ స్కూల్ (మీర్‌పేట్), మూడోస్థానంలో భారతీయ విద్యా భవన్ CBSE (రామచంద్రపురం) నిలించింది.. మ్యాచులు జరిగే కొద్ది.. లీడర్‌బోర్డ్‌లో పోజిషన్స్ మారే అవకాశం ఉంది..

ఈ పోటీల్లో .. 395 పాఠశాలల నుండి 16,354 మంది అథ్లెట్లు 19 క్రీడలలో పోటీపడుతున్నారు.. SFA ఛాంపియన్‌షిప్‌ 2024 లో భాగంగా హైదరాబాద్ ఎడిషన్… అక్టోబర్ 22 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి వేదికగా మారింది.. అంతేకాకుండా.. వారి పాఠశాలల పేరు ప్రసిద్ధి చెందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మ్యాచ్‌లను SFA అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.