Ruling TRS Mass Protest: కేంద్రం వైఖరేంటి?.. వరి ధాన్యం సేకరణపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన మంత్రుల బృందం..
Telangana Government: యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని కోరుతూ..

Telangana Government: యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని కోరుతూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ బృందంలో మంత్రులు హరీష్ రావు , మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ తదితరులు ఉన్నారు.
తాము చేపట్టిన ధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశామని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమమే రైతులు, వాళ్ల సమస్యల చుట్టూ తిరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తుందన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దమవుతుందన్నారు. యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేసేయాలని డిమాండ్ చేశారు.
Also read:
Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. అమర జవాన్ల త్యాగాలు ఇతివృత్తంగా..
