Viral Video: భారీ కొండచిలువకు చిక్కిన హనీ బ్యాడ్జర్.. భయం లేకుండా చెడుగుడు ఆడుకుంది.. చూస్తే నోరెళ్లబెడతారు
అడవి ప్రపంచం పూర్తిగా విభిన్నమైనది. అక్కడ ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని జంతువులు ఇతర జంతువులకు ఆహారంగా..
![Viral Video: భారీ కొండచిలువకు చిక్కిన హనీ బ్యాడ్జర్.. భయం లేకుండా చెడుగుడు ఆడుకుంది.. చూస్తే నోరెళ్లబెడతారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/11/honey-badger.jpg?w=1280)
అడవి ప్రపంచం పూర్తిగా విభిన్నమైనది. అక్కడ ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని జంతువులు ఇతర జంతువులకు ఆహారంగా మారితే.. మరికొన్ని జంతువులు.. మిగతా జంతువులను వేటాడి వెంటాడతాయి. అయితే సైజ్, సామర్ధ్యంతో పట్టింపు లేకుండా కొన్ని జంతువులు.. క్రూర జంతువులకు గట్టి పోటీని ఇస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎడుర్కుంటాయి. అలాంటి భయం లేని జంతువులలో ఒకటి హనీ బ్యాడ్జర్(Honey Badger).
ఈ హనీ బ్యాడ్జర్ ఎడారిలో ఏమాత్రం భయం లేకుండా ఒంటరిగా జీవిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన, భయం లేని జంతువుగా హనీ బ్యాడ్జర్ పేరుగాంచింది. ఇవి ఓ అరుదైన జాతికి చెందిన జంతువులని చెప్పొచ్చు. వీటి చర్మం ఎలాస్టిక్‌గా ఉంటుంది. అలాగే పదునైన పళ్లు కలిగి ఉంటాయి. సింహం, పులి, చిరుత, కొండచిలువ.. ఇలా ఏ జంతువుతోనైనా ఇది యుద్ధం చేయగలదు. పాము విషం కూడా హనీ బ్యాడ్జర్‌ను ఏం చేయలేదు. ఇక ఇలాంటి జంతువుకు ఓ భారీ కొండచిలువ ఎదురైతే.. ఆ పోరాటం ఎట్టుంటుందో తెలుసా.? అయితే ఈ వీడియో మీకోసమే.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ భారీ కొండచిలువ.. హనీ బ్యాడ్జర్‌ను చుట్టేసినట్లు మీరు చూడవచ్చు. చిటికెలో ఆ హనీ బ్యాడ్జర్‌ను మింగేయాలనుకుంటుంది. అయితే ఇక్కడే సీన్ కాస్తా రివర్స్ అవుతుంది. ఆ విషసర్పం నుంచి హనీ బ్యాడ్జర్ సునాయాసంగా బయటపడుతుంది. అనూహ్యంగా ఈలోపే అక్కడికి రెండు నక్కలు వస్తాయి. హనీ బ్యాడ్జర్‌ను వేటాడటానికి ప్రయత్నిస్తాయి.
అయితే హనీ బ్యాడ్జర్ ఏమాత్రం భయపడకుండా ఆ మూడింటిని ధైర్యంగా ఎదుర్కుంటుంది. కొండచిలువ తోకను కొరుకుతూ దాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. చివరికి ఆ కొండచిలువ తోక ముడిచి పొదల్లోకి వెళ్లిపోతుంది. కాగా, ఈ వీడియోను ‘Erik Solheim’ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!
This three-way fight between a python, honey badger and two jackals is seriously intense – nature is wild! ?
— Erik Solheim (@ErikSolheim) October 17, 2021