MS Dhoni: కొత్త భాగస్వామితో ‘చాయ్‌ డేట్స్‌’లో మహేంద్రుడు.. నెట్టింట్లో పంచుకున్న సాక్షిధోని.. వైరలవుతోన్న ఫొటో

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండని విషయం తెలిసిందే. మహీ భార్య సాక్షి అభిమానులకు ధోని అప్‌డేట్‌లను ఇస్తూనే ఉంటుంది.

MS Dhoni: కొత్త భాగస్వామితో 'చాయ్‌ డేట్స్‌'లో మహేంద్రుడు.. నెట్టింట్లో పంచుకున్న సాక్షిధోని.. వైరలవుతోన్న ఫొటో
Ms Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Nov 18, 2021 | 4:15 PM

MS Dhoni: టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన తర్వాత న్యూజిలాండ్‌కు ఆతిథ్యమివ్వడంలో టీమిండియా బిజీగా ఉంది. న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అదే సమయంలో, ప్రపంచ కప్‌లో జట్టుకు మెంటార్‌గా మారిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రాంచీకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ధోని తన ఇంట్లో ‘హనీ’తో గడుపుతున్నాడు. ఈ ఫొటోను మహి భార్య సాక్షి ధోని పంచుకుంది. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో చాలా అరుదుగా యాక్టివ్‌గా ఉంటాడు. ధోని నెట్టింట్లో లేని లోటును భార్య సాక్షి తీరుస్తుంది. అభిమానులకు ధోనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచుగా పంచుకుంటుంది. తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ధోని ‘టీ డేట్‌’లో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫొటోలో సాక్షి ధోని మాత్రం లేదు. ధోని కొత్త భాగస్వామితో ఈ ఫొటోలో సందడి చేస్తున్నాడు. అభిమానులు కూడా ఈ ఫొటోను చాలా ఇష్టపడుతున్నారు.

సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ ఫొటోలో ధోని చిలుకతో కనిపించాడు. తన పెంపుడు చిలుక అతని భుజంపై కూర్చొని ఉండగా ధోని చేతిలో టీ గ్లాసు ఉంది. ‘ధోనీ విత్ హిజ్ హనీ. #చాయ్‌డేట్స్’ అంటూ క్యాప్షన్ అందించింది. ధోని కొత్త పెంపుడు జంతువు పేరు హనీ అని ఊహిస్తున్నారు. ధోనీకి ఇప్పటికే తన ఏడు కుక్కలతో సహా అనేక పెంపుడు జంతువులు ఉన్నాయి. కుక్కలే కాకుండా, గుర్రాలు అనేక పక్షులు వాటిలో ఉన్నాయి. ధోని తన కుక్కలతో ఎక్కువ సమయం గడుపుతూ వాటికి స్వయంగా శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ధోని కుక్కలకు శిక్షణ ఇస్తున్న వీడియోలను కూడా చూడవచ్చు.

ఆదరణ తగ్గని ధోని.. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ, అప్పుడప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంటాడు. ధోని లుక్, బైక్‌ల గురించి ఫ్యాన్స్‌ ధోనిని ట్రెండింగ్ చేస్తుంటారు. ఇప్పటికీ మహి అంటే ఫ్యాన్స్‌కు చాలా ఇష్టం. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. దీని తర్వాత ధోని టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాతో మెంటార్‌గా చేరాడు.

Also Read: IND vs NZ: రోహిత్ ఇలా చేయడం ఏం బాగోలేదు.. ఇంతమాత్రం దానికి ఆ ఆల్‌రౌండర్‌ అవసరమా?: ఆకాష్ చోప్రా విమర్శలు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ మైదానం.. అక్కడ మ్యాచ్ అంటేనే భయపడుతోన్న బ్యాట్స్‌మెన్స్.. భారత్, కివీస్ తొలి టెస్ట్‌పై నెలకొన్న ఆసక్తి