Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. అమర జవాన్ల త్యాగాలు ఇతివృత్తంగా..

రాజకీయ అరంగేట్రానికి ముందే స్మృతి ఇరానీ సినీ నటిగా దేశ వ్యాప్త గుర్తింపు సాధించారు. 2014లో నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకుని అందరి చూపు తన వైపునకు తిప్పుకున్నారు.

Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. అమర జవాన్ల త్యాగాలు ఇతివృత్తంగా..
Smriti Irani
Follow us

|

Updated on: Nov 18, 2021 | 4:25 PM

రాజకీయ అరంగేట్రానికి ముందే స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సాధించారు. కొన్ని సినిమాల్లోనూ నటిగా మెప్పించారు.  2014లో నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆమె.. అందరి చూపు తన వైపునకు తిప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని మట్టికరిపించి తన క్రేజ్‌ను మరింతపెంచుకున్నారు. బీజేపీలో కీలక మహిళా నాయకురాలిగా ఎదిగారు. ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆమె..రచయిత్రిగా కొత్త అవతారమెత్తనున్నారు. ఆమె రచించిన తొలి నవల ‘లాల్ సలాం’ (Lal Salaam) ఈ నెల 29న మార్కెట్‌లో విడుదలకానుంది. 2010 ఏప్రిల్‌లో దంతేవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత ఇతివృత్తంగా ఆమె ఈ పుస్తకాన్ని రచించారు. తన పుస్తకంతో దేశం కోసం దశాబ్దాలుగా సేవ చేసి.. ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు స్మృతి ఘనమైన నివాళులర్పించనున్నారు. వెస్ట్‌లాండ్ పబ్లిషింగ్ సంస్థ స్మృతి రచించిన పుస్తకాన్ని దేశ వ్యాప్తంగా పుస్తక ప్రియులకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ పుస్తకం ప్రీ ఆర్డర్స్ కూడా అమెజాన్‌లో మొదలయ్యాయి. కవర్ పేజీకి సంబంధించిన మోషన్ పిక్చర్‌ను స్మృతి ఇరానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పుస్తక ఇతివృత్తం చాలా రోజులుగా తన మదిలో ఉన్నదేనని స్మృతి ఇరానీ తెలిపారు. తన నవల పాఠకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

వ్యవస్థలు, అవినీతితో యువ ఆఫీసర్ విక్రమ్ ప్రతాప్ సింగ్ ఎదుర్కొన్న ఇబ్బందులను లాల్ సలాం పుస్తకంలో స్మృతి కళ్లకు కట్టినట్లు వివరించనున్నారు. ప్రతికూల పరిస్థతులపై పోరు నేపథ్యంతో కూడిన ఈ పుస్తకం..పాఠకులను తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని వెస్ట్‌లాండ్ పబ్లిషక్ వీకే కార్తీక ఆశాభావం వ్యక్తంచేశారు.

Also Read..

Deepak Chahar: ఒక్క చూపుతో లక్ష రూపాయలు గెలిచాడు.. అదేలాగంటారా..

Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..