AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar: ఒక్క చూపుతో లక్ష రూపాయలు గెలిచాడు.. అదేలాగంటారా..

బుధవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‎లో ఇండియా బౌలర్ దీపక్ చాహర్ రూ. లక్ష గెలుచుకున్నాడు...

Deepak Chahar: ఒక్క చూపుతో లక్ష రూపాయలు గెలిచాడు.. అదేలాగంటారా..
Deepak Chahar
Srinivas Chekkilla
|

Updated on: Nov 18, 2021 | 2:00 PM

Share

బుధవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‎లో ఇండియా బౌలర్ దీపక్ చాహర్ రూ. లక్ష గెలుచుకున్నాడు. అవును చూపుతోనే లక్ష రూపాయలు సంపాదించాడు. ఈ మ్యాచ్‎లో 18వ ఓవర్ చాహర్ వేశాడు. మొదటి బంతిని బ్లాక్ క్యాప్స్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌ సిక్స్ కొట్టాడు. అతను బంతిని కొట్టిన తర్వాత బాల్‎ను చూడకుండా గుప్టిల్ తన కళ్లతో చాహర్‌ను కోపంతో చూశాడు. అయితే తర్వాతి బంతికే చాహర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. దాదాపు అదే డెలివరీతో గుప్టిల్ బోల్తా కొట్టించాడు. గుప్తిల్ శ్రేయస్స్ అయ్యర్‎కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడు చాహర్ అదే చూపుతో గుప్టిల్‎ను చూశాడు. ఆ చూపే చాహర్‌కు రూ. 1 లక్ష సంపాదించి పెట్టింది. దీపక్​ లుక్స్​కు ప్రశంస లభించింది. ‘మూమెంట్​ ఆఫ్​ ది మ్యాచ్’తో పాటు రూ. లక్ష నగదు అతడు గెలుచుకున్నాడు.

న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్‎‎తో రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 36 బంతుల్లో 48 పరుగులు చేసిన రోహిత్ బౌల్డ్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేసిన సూర్యకుమార్ కూడా వెనుదిరగడంతో ఇండియా కష్టాల్లో పడింది. శ్రేయస్స్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఇండియా విజయంపై ఉత్కంఠ నెలకొంది. కానీ రిషభ్ పంత్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. కివీస్ బౌలర్లలో ఫర్గిసన్, డారిల్ మిచెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, సౌథీ, అస్ట్లే ఒక్కో వికెటు తీశారు.

అంతుకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ డారిల్ మిచెల్ డౌకౌట్ అయ్యాడు. చాప్‎మన్‎తో కలిసి గుప్టిల్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. గుప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. చాప్‎మన్ 50 బంతుల్లో 63 రన్స్ చేశాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. దీపక్ చాహర్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. శుక్రవారం జరిగే రెండో టీ20లో ఇరు జట్లు తలపడనున్నాయి.

Read Also.. IND vs NZ: సిరాజ్‎ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు.. వైరల్‎గా మారిన వీడియో..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?