Ravichandran Ashwin: ఆనందం తిరిగొచ్చింది.. కోచ్ రాహుల్ ద్రవిడ్‎పై అశ్విన్ ప్రశంసలు..

రాహుల్ ద్రవిడ్ కోచ్‎గా మొదటి విజయం సాధించాడని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. న్యూజిలాండ్‎తో మ్యాచ్ అంతరం అశ్విన్ మాట్లాడారు....

Ravichandran Ashwin: ఆనందం తిరిగొచ్చింది.. కోచ్ రాహుల్ ద్రవిడ్‎పై అశ్విన్ ప్రశంసలు..
Ashwin
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 18, 2021 | 1:56 PM

రాహుల్ ద్రవిడ్ కోచ్‎గా మొదటి విజయం సాధించాడని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. న్యూజిలాండ్‎తో మ్యాచ్ అంతరం అశ్విన్ మాట్లాడారు. ” రాహుల్ ద్రవిడ్ కోచింగ్ శైలిపై వ్యాఖ్యానించడం నాకు చాలా తొందరగా ఉంది. అతను అండర్-19 స్థాయి కోచ్‎గా ఉంటూ వస్తున్నాడు. అతను ఎక్కువ అవకాశం వదలడు. మేం డ్రెసింగ్ రూమ్‎లో ఆనందన్ని తిరిగి తెచ్చాం ” అని అశ్విన్ అన్నాడు. “ఎంత నెమ్మదిగా బౌలింగ్ చేస్తే, ఈ పిచ్‌లో ఎక్కువ లాభం పొందవచ్చు. లెంగ్త్‌లను మిస్ చేయలేదు. ఇది కొంచెం తక్కువ స్కోరు. 170-180 సమానంగా ఉంటుందని మేము భావించాం.’’ అని అశ్విన్ అన్నాడు. ” నేను పవర్‌ప్లేలో మొదటి ఓవర్‌ని బౌల్ చేసాను. బౌలింగ్ చేయడానికి పేస్‌ని గుర్తించడం చాలా ముఖ్యం. దానిని గుర్తించడానికి నాకు కొంత సమయం పట్టింది. ఇది పేస్‌ను బట్టి మారుతూ ఉంటుంది.” అని చెప్పాడు.

న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్‎‎తో రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 36 బంతుల్లో 48 పరుగులు చేసిన రోహిత్ బౌల్డ్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేసిన సూర్యకుమార్ కూడా వెనుదిరగడంతో ఇండియా కష్టాల్లో పడింది. శ్రేయస్స్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఇండియా విజయంపై ఉత్కంఠ నెలకొంది. కానీ రిషభ్ పంత్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. కివీస్ బౌలర్లలో ఫర్గిసన్, డారిల్ మిచెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, సౌథీ, అస్ట్లే ఒక్కో వికెటు తీశారు.

అంతుకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ డారిల్ మిచెల్ డౌకౌట్ అయ్యాడు. చాప్‎మన్‎తో కలిసి గుప్టిల్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. గుప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. చాప్‎మన్ 50 బంతుల్లో 63 రన్స్ చేశాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. దీపక్ చాహర్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. శుక్రవారం జరిగే రెండో టీ20లో ఇరు జట్లు తలపడనున్నాయి.

Read Also.. Rohit Sharma: వైరల్‎గా మారిన రోహిత్ శర్మ ట్వీట్.. ఆ పోస్ట్ ఎప్పుడు చేశారంటే..