Rohit Sharma: వైరల్‎గా మారిన రోహిత్ శర్మ ట్వీట్.. ఆ పోస్ట్ ఎప్పుడు చేశారంటే..

రోహిత్ శర్మ టీ20 జట్టు కెప్టెన్‎గా తొలి విజయం సాధించాడు. అయితే అతడు తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‎గా మారింది. అతను 2012లో జైపూర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబైకి కెప్టెన్‎గా వ్యవహరించాడు...

Rohit Sharma: వైరల్‎గా మారిన రోహిత్ శర్మ ట్వీట్.. ఆ పోస్ట్ ఎప్పుడు చేశారంటే..
Rohit Sharma
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 18, 2021 | 12:17 PM

రోహిత్ శర్మ టీ20 జట్టు కెప్టెన్‎గా తొలి విజయం సాధించాడు. అయితే అతడు తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‎గా మారింది. అతను 2012లో జైపూర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబైకి కెప్టెన్‎గా వ్యవహరించాడు. ” జైపూర్‌కు చేరుకున్నాం. నేను జట్టుకు నాయకత్వం వహిస్తాను. అదనపు బాధ్యత కోసం ఎదురు చూస్తున్నాను” అని రోహిత్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‎ను 2012 నవంబర్ 7న చేశాడు. ప్రస్తుతం పోస్ట్ వైరల్‎ అయింది. “మొదటిసారి రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ముంబైని నడిపించాడు. మొదటిసారిగా రోహిత్ శర్మ పూర్తి సమయం టీ20 కెప్టెన్‌గా భారత్‌కు నాయకత్వం వహిస్తాడు.” అని ఒక అభిమాని రోహిత్ చేసిన ట్వీట్‌ను వివరిస్తూ రాశాడు.

న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్‎‎తో రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 36 బంతుల్లో 48 పరుగులు చేసిన రోహిత్ బౌల్డ్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేసిన సూర్యకుమార్ కూడా వెనుదిరగడంతో ఇండియా కష్టాల్లో పడింది. శ్రేయస్స్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఇండియా విజయంపై ఉత్కంఠ నెలకొంది. కానీ రిషభ్ పంత్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. కివీస్ బౌలర్లలో ఫర్గిసన్, డారిల్ మిచెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, సౌథీ, అస్ట్లే ఒక్కో వికెటు తీశారు.

అంతుకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ డారిల్ మిచెల్ డౌకౌట్ అయ్యాడు. చాప్‎మన్‎తో కలిసి గుప్టిల్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. గుప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. చాప్‎మన్ 50 బంతుల్లో 63 రన్స్ చేశాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. దీపక్ చాహర్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. శుక్రవారం జరిగే రెండో టీ20లో ఇరు జట్లు తలపడనున్నాయి.

Read  Also.. Wasim Akram: అతడిని కాదని డేవిడ్ వార్నర్‎కే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎందుకించారంటే..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్