Drugs: తెలంగాణకు డ్రగ్స్ సప్లై అంటేనే గజగజ వణుకుతున్న పెడ్లర్లు.. ఎందుకో తెలుసా..?

డ్రగ్ పెడ్లర్లు, కన్స్యూమర్లకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే..! చిన్న లింక్ దొరికినా సరే.. దాన్ని ఎవరికి బట్వాడా చేస్తున్నారు. అసలు ఆ డ్రగ్ పుట్టు పూర్వోత్తరాల లెక్క తేలుస్తోంది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో.

Drugs: తెలంగాణకు డ్రగ్స్ సప్లై అంటేనే గజగజ వణుకుతున్న పెడ్లర్లు.. ఎందుకో తెలుసా..?
Drugs
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 03, 2024 | 7:30 PM

మహానగరం మత్తు మస్తీకి కేరాఫ్‌గా మారిందా?.. అంత సీనులేదు. హైదరబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను డ్యామేజీ చేయడం కాదుకదా చేయాలనే ఆలోచన చేసినా మక్కెలిరిగొట్టి మడతెత్తుడే.. ఉక్కుపాదం ఆ లెవల్‌లో బోట్లు బిగించేస్తుంది. మాదాపూర్‌ క్లౌడ్‌ 9 లో డ్రగ్‌ పార్టీని బ్రేక్‌ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు నాగరాజు యాదవ్‌ డ్రగ్‌ లింకులపై కూపీలాగారు. ఆ ఇన్ఫోతో హాస్టళ్లపై రెయిడ్‌ చేస్తే ఎస్‌ఆర్‌నగర్‌ వెంకట్‌ బాయ్స్‌ హాస్టల్‌లో డ్రగ్‌ రాకెట్‌ బయటపడింది. ఈ క్రమంలోనే మహానగర శివారుల్లో, సిటీల్లో, గల్లీల్లో ఎక్కడ డ్రగ్‌ జాడ కనిపించినా .. ఆ మాట వినిపించినా ఖాకీలు ఇట్టే వాలిపోతున్నారు. సరుకు సీజ్‌ చేయడం మత్తుగాళ్లను అత్తారింటికి పంపడం మాత్రమే కాదు డ్రగ్‌ మాఫియా బెండు తీస్తున్నారు.

డ్రగ్ పెడ్లర్లు, కన్స్యూమర్లకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే..! చిన్న లింక్ దొరికినా సరే.. దాన్ని ఎవరికి బట్వాడా చేస్తున్నారు. అసలు ఆ డ్రగ్ పుట్టు పూర్వోత్తరాల లెక్క తేలుస్తోంది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. ఈ క్రమంలోనే తెలంగాణలో పోలీసుల వరుస దాడులతో హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్ ముఠా వణికిపోతుంది.

డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లడంటూ తెగేసి చెప్తున్నారట డ్రగ్ మాఫియా. ఇటీవల తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. బెంగళూరులో ఉన్న కింగ్ పిన్ ను పట్టుకోవడానికి వెళ్లారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. డ్రగ్స్ దిగుమతి కోసం సంప్రదించగా.. పకడ్బందీ వెరిఫికేషన్ తర్వాత మాదక ద్రవ్యాలు ఇచ్చేందుకు అంగీకరించారు. డ్రగ్స్ డెలివరీ జరిపే సమయంలో తమ ఆచూకీ నర మానవుడికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది డ్రగ్స్ ముఠా.

ఆన్ లైన్‌లో డబ్బులు చెల్లిస్తే, రెండు గంటల తర్వాత డ్రగ్స్ ఎక్కడ పెట్టారో వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా చెత్త డబ్బాలో.. రెడ్ కలర్ కవర్‌లో, చెట్టు కింది భాగంలో బ్లూ కలర్ కవర్ లో, రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టి డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మత్తు పదార్ధాలు కొనేవారికి తమ ముఖం కనబడకుండా, ఆచూకీ చిక్కకుండా… ఓ రేంజ్ జాగ్రత్తలు తీసుకుంటుంది డ్రగ్స్ ముఠా. మొత్తంగా తెలంగాణకు డ్రగ్స్ సప్లై అంటేనే.. పెడ్లర్లు, కింగ్ పిన్స్ భయపడే పరిస్థితి తెచ్చారు తెలంగాణ పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..