AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Muskan: ఆపరేషన్ ముస్కాన్ సూపర్ సక్సెస్.. వేల సంఖ్యలో చిన్నారుల విముక్తి..!

ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో.. వివిధ కారణాల వల్ల కొందరు బాలబాలికలు కార్మికులుగా మారుతున్నారు. ఇందుకు పేదరికం ప్రధాన కారణమైతే, తల్లిదండ్రులు లేకపోవడం.. పట్టించుకోకపోవడం వంటి కారణాలు మరికొన్ని. కొంతమంది అనాథ పిల్లలు..

Operation Muskan: ఆపరేషన్ ముస్కాన్ సూపర్ సక్సెస్.. వేల సంఖ్యలో చిన్నారుల విముక్తి..!
Operation Muskaan
Ranjith Muppidi
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 03, 2024 | 5:26 PM

Share

ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో.. వివిధ కారణాల వల్ల కొందరు బాలబాలికలు కార్మికులుగా మారుతున్నారు. ఇందుకు పేదరికం ప్రధాన కారణమైతే, తల్లిదండ్రులు లేకపోవడం.. పట్టించుకోకపోవడం వంటి కారణాలు మరికొన్ని. కొంతమంది అనాథ పిల్లలు.. బుక్కడు తిండి కోసం పసి ప్రాయంలోనే వయస్సును మించిన పనులు చేస్తూ, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. అలాంటివారిని రెస్క్యూ చేసి.. సంరక్షించడం.. తల్లిదండ్రులు ఉంటే వారి వద్దకు చేర్చడమే ‘ఆపరేషన్ ముస్కాన్’ ప్రధాన ఉద్దేశం.

పిల్లలకు ఎవరూ లేకపోతే వారిని.. గవర్నమెంట్ నిర్వహించే స్టేట్ హోమ్‌కు పంపుతారు. ఈ కార్యక్రమం సత్ఫాలితాలను ఇస్తోంది. ఇందుకోసం.. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 25 డివిజన్‌ల్లో.. 25 ప్రత్యేక టీమ్స్ పని చేస్తున్నాయి. చైల్డ్ హెల్ప్‌ లైన్, రెవెన్యూ శాఖ, ఎడ్యుకేషన్, హెల్త్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక శాఖల సిబ్బందితో పాటు పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఈ టీమ్స్‌లో భాగం చేశారు.

పదో దశలో చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌తో భాగంగా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 524 మంది రెస్క్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 43 మంది బాలికలు ఉండగా.. 481 మంది బాలలు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 317మంది ఉండగా… ఇతర రాష్ట్రాల పిల్లలు 207 మంది ఉన్నట్లు అధికారులు గణాంకాలను వివరించారు. ఈ ఘటనల్లో పిల్లలను పనిలో పెట్టుకున్న 20మందిపై కేసు నమోదు చేశారు. వారందరికీ కలిపి రూ.11.21లక్షల ఫైన్ విధించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 326 మంది పిల్లల్ని సంరక్షించగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 651 మంది పిల్లలను రెస్క్యూ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,076మంది పిల్లలను రెస్య్యూ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 2,772 మంది బాలలు, 304మంది బాలికలు ఉన్నారన్నారు. 2023లో 2,617 మందిని రెస్క్యూ చేయగా… ఈ సంవత్సరం ఇప్పటికే 3,076 మందిని సంరక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బాలకార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే, 1098, 100కు ఫోన్ చేయడం కానీ లేదా లోకల్​పోలీసులకు సమాచారం ఇవ్వాలని పౌరులను పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..