AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mongooses: ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!

Mongooses: ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!

Anil kumar poka
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 03, 2024 | 6:41 PM

Share

సాటి మనుషులను ప్రేమించలేని ఈ రోజులలో అడవిలో ఉన్న జంతువులను అక్కున చేర్చుకొని వాటిని సాకుతూ, జీవం పోస్తున్న జంతు ప్రేమికుడిని ఇక్కడ చూస్తున్నాం. చిన్న పసికూనలను అక్కున చేర్చుకొని పాలిచ్చి పెంచి పోషిస్తున్న ఈ జంతు ప్రేమికుడు చూడాలంటే జనగాం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. వనంలో దొరికిన ఈ పసికూనలను జనంలోకి తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నాడు జనగామ జిల్లా కేంద్రం అంబేద్కర్ నగర్ కు చెందిన సలీం పాషా.

సాటి మనుషులను ప్రేమించలేని ఈ రోజులలో అడవిలో ఉన్న జంతువులను అక్కున చేర్చుకొని వాటిని సాకుతూ, జీవం పోస్తున్న జంతు ప్రేమికుడిని ఇక్కడ చూస్తున్నాం. చిన్న పసికూనలను అక్కున చేర్చుకొని పాలిచ్చి పెంచి పోషిస్తున్న ఈ జంతు ప్రేమికుడు చూడాలంటే జనగాం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. వనంలో దొరికిన ఈ పసికూనలను జనంలోకి తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నాడు జనగామ జిల్లా కేంద్రం అంబేద్కర్ నగర్ కు చెందిన సలీం పాషా. ఎక్కడైనా కుక్కలను, కోళ్లను, పక్షులను, పాలిచ్చే పాడి గేదెలను పెంచుకోవడం చూస్తుంటాం. కానీ ఈ సలీం పాషా పాములకు బద్ధ శత్రువుగా భావించే ముంగీసను తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. పాముల బెడద నుండి తన ఇంటిని, చుట్టుపక్కల వారిని కాపాడుతున్నాడు ఈ కరాటే మాస్టర్‌. ఎన్నో వేల మందికి కరాటే నేర్పించిన సలీం పాషా ఇప్పుడు జంతు రక్షకుడిగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కొంత కాలం క్రితం షికారిగాళ్ల ఉచ్చు నుంచి పాష ఒడికి చేరిన ముంగీసలను చంటిపిల్లాడిని సాకినట్లుగా పాలు, ధాన్యం గింజలు వంటి పోషకాహారం ఇస్తూ పోషిస్తున్నాడు. అంతేకాకుండా వాటికి ముద్దుగా పేర్లు కూడా పెట్టుకుని పిలుచుకుంటున్నాడు. సలీపాషా ఎక్కడి వెళితే అక్కడికి కాళ్లల్లోనే తిరుగుతూ సందడి చేస్తుంటాయి. సలీం పాషా పెడితేనే అవి తింటాయి. వాటిని ఒక్కరోజు చూడకపోయినా తనకు మనసొప్పదని సలీంపాస అంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా...

Published on: Aug 03, 2024 06:21 PM