Viral: తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో ఇద్దరు మధ్య వాగ్వాదం.!

Viral: తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో ఇద్దరు మధ్య వాగ్వాదం.!

Anil kumar poka

|

Updated on: Aug 03, 2024 | 6:28 PM

ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ మనం రీల్స్‌ కోసం యువత రెచ్చిపోయి ప్రవర్తించిన సీన్స్‌ ఎన్నో చూశాం. అప్పుడప్పుడు చిన్నపాటి ఫైటింగ్‌లు కూడా జరుగుతుంటాయి ఈ మెట్రోలో. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టాడు. వారి వివాదానికి గల కారణం తెలియలేదు కానీ.. ఈ ఘటన తాలూకు వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ మనం రీల్స్‌ కోసం యువత రెచ్చిపోయి ప్రవర్తించిన సీన్స్‌ ఎన్నో చూశాం. అప్పుడప్పుడు చిన్నపాటి ఫైటింగ్‌లు కూడా జరుగుతుంటాయి ఈ మెట్రోలో. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టాడు. వారి వివాదానికి గల కారణం తెలియలేదు కానీ.. ఈ ఘటన తాలూకు వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. తొలుత ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే వారి వివాదం ముదిరి అనూహ్య మలుపు తీసుకుంది. ఓ ప్రయాణికుడు అవతలి వ్యక్తిని ఏకంగా చెప్పుతో కొట్టాడు. దీంతో, క్షణకాలం షాకైపోయిన అతడు తనను చెప్పుతో కొట్టిన వ్యక్తి చెంఫ ఛెళ్లుమనిపించాడు. ఆ తరువాత అతడి నుంచి దూరంగా వెళుతుండగా ప్రయాణికుడు మళ్లీ చెప్పు పట్టుకుని అతడిని వెంబడించాడు. ఈలోపు, మరో వ్యక్తి జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నాడు. ఈ వీడియోను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో దీనిపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెప్పుతో కొట్టిన వ్యక్తిని అరెస్టు చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్కారం లేనివాళ్లను మెట్రోల్లోకి అనుమతించకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. మెట్రోలో అంతమంది ఉన్న కేవలం ఒకే వ్యక్తి గొడవ ముదరకుండా అడ్డుకోవడం నెటిజన్లు ఆశ్చర్యపరిచింది. అక్కడున్న మిగతా వారికి సామాజిక స్పృహలేదంటూ దుమ్మెత్తిపోశారు. చెప్పుతో కొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉండిఉండొచ్చని కొందరు అన్నారు. అవతలి వ్యక్తి చెప్పుతో కొట్టేందుకు సిద్ధమవుతున్నా దెబ్బపడే వరకూ రెండో ప్రయాణికుడు స్పందించకపోవడం ఏంటని మరికొందరు ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.