Konda Surekha: వరంగల్ తూర్పులో టెన్షన్ టెన్షన్.. వదిలే ప్రసక్తే లేదంటూ పోలీసులకు కొండా సురేఖ వార్నింగ్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు, కాంగ్రెస్ నేత కొండా సురేఖకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వరంగల్ తూర్పు MLA నరేందర్ ఇంటిముందు తన ప్రచారరథాన్ని పెట్టి కొండా సురేఖ అనుచరులు డ్యాన్స్‌లు చేయడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ వాహనాన్ని అక్కడి నుండి తరలించారు.
![Konda Surekha: వరంగల్ తూర్పులో టెన్షన్ టెన్షన్.. వదిలే ప్రసక్తే లేదంటూ పోలీసులకు కొండా సురేఖ వార్నింగ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/konda-surekha.jpg?w=1280)
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు, కాంగ్రెస్ నేత కొండా సురేఖకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వరంగల్ తూర్పు MLA నరేందర్ ఇంటిముందు తన ప్రచారరథాన్ని పెట్టి కొండా సురేఖ అనుచరులు డ్యాన్స్‌లు చేయడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ వాహనాన్ని అక్కడి నుండి తరలించారు. విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కొండా సురేఖ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తేలేదని సీఐకీ, పోలీస్ సిబ్బందికీ వార్నింగ్ ఇచ్చారు. కావాలనే తమపై కేసులు పెడుతున్నారంటూ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..? అండర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో MLA నరేందర్ ఇంటిముందు తన ప్రచారరథాన్ని పెట్టి కొండా సురేఖ అనుచరులు డ్యాన్స్‌లు చేయడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. మిల్స్ కాలనీకి చెందిన సిఐ ప్రచార రథాన్ని అడ్డుకొని డ్రైవర్ పై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అనంతరం సీఐ సదరు వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొనగా వరంగల్ ఏసిపి బోనాల కిషన్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన వాహనాన్ని వదిలేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన విరమించారు.
ఇదిలాఉంటే గత రెండు రోజులుగా సీఐపై అనేక ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లిఖితపూర్వకంగా స్థానిక సీఐ సురేష్ తో పాటు ఇంతేజార్ గంజ్ సీఐ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనలపై సిపి క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఇరువురు సిఐలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.
వీడియో చూడండి..
అయితే, గత రాత్రి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇంటి వద్ద చేతిపంపు నిర్మాణ పనులను కొండా సురేఖ అడ్డుకోగా.. మిల్స్ కాలనీకి చెందిన సీఐ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు దుర్భాషలాడని.. తాజాగా ఇంతెజార్ గంజ్ సీఐ పలువురి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని కొండా సురేఖ ఆరోపించారు. గత రెండు రోజులుగా జరిగిన ఘటనలపై ఏసీపీ బోనాల కిషన్ వివరణ ఇచ్చారు.
అన్ని పార్టీల నాయకులు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. తాము సమన్వయం పాటిస్తున్నామని.. తమ ఓపికను పరీక్షిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 17 కేసులు నమోదు చేశామని ఏసిపి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..