Telangana Elections: తెలంగాణలో దాని చుట్టూ రాజకీయం.? ఓట్లు చీలే అవకాశం..
ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇవ్వడం, స్వయంగా ప్రధాని మోదీనే కమిటీ వేస్తామని చెప్పడం అంటే ఒక అడుగు ముందుకేయడమే. అయితే, ఇదే సమయంలో మాలల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్గీకరణకు మోదీ మద్దతు ఇవ్వడాన్ని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీని ఓడించాలని మాల ప్రజాసంఘాల జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్చింది కూడా. ఇలా జరుగుతుందని తెలిసే..
ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇవ్వడం, స్వయంగా ప్రధాని మోదీనే కమిటీ వేస్తామని చెప్పడం అంటే ఒక అడుగు ముందుకేయడమే. అయితే, ఇదే సమయంలో మాలల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్గీకరణకు మోదీ మద్దతు ఇవ్వడాన్ని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీని ఓడించాలని మాల ప్రజాసంఘాల జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్చింది కూడా. ఇలా జరుగుతుందని తెలిసే.. ఏ పార్టీ కూడా వర్గీకరణ జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలకూ మాల, మాదిగ సామాజికవర్గ ఓట్లు కావాలి. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాలల కంటే మాదిగలు 17 లక్షలు అధికంగా ఉన్నారు. కానీ, ఏపీలో మాలల జనాభానే ఎక్కువ. సో, కరవమంటే పాముకు కోపం, విడవమంటే కప్పకు కోపం అన్నట్టు ఎవరినీ దూరం చేసుకున్నా తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీలకు నష్టం జరుగుతుంది. అందుకే వర్గీకరణ సమస్య ఇలా నలుగుతూ ఉంది. సరే.. ఇంతకీ దళితుల ఓటు ఎటు? ఏ పార్టీకి ఓటు వేస్తారు. ఇది సమాధానం చెప్పలేని ప్రశ్నే. వర్గీకరణకు సంబంధం లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దళితులు మద్దతిస్తున్నారు. ఆల్రడీ బీఎస్పీ వెంట దళితులు నడుస్తున్నారు. ఇప్పుడు కొన్ని దళిత ఓట్లను బీజేపీ పంచుకోబోతోంది. ఓవరాల్‌గా దళితులు ఏ ఒక్క పార్టీ వైపో నడవరని తేలిపోయింది. వర్గీకరణపై మోదీ హామీని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో, రిజల్ట్ ఏంటనేది డిసెంబర్ 3న స్క్రీన్‌పై చూడాల్సిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

ప్రేమిస్తే చావేనా?ఓ తండ్రి పరువు కోసం..వీడియో

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్.. వీడియో

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తె.. కన్నతండ్రి ఏం చేశాడంటే..

మనవరాలు చేసిన పనికి.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ

నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు
