Telangana Congress: రేవంత్ వ్యాఖ్యల దూమారం.. మళ్ళీ మొదటికొచ్చిన కాంగ్రెస్ వ్యవహారం..
ఉచిత విద్యుత్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలు పైకి సమర్థిస్తున్నా లోపల పార్టీకి నష్టం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ వ్యాఖ్యలపై పిఏసి వేదికగా సీనియర్లు ఎలా వ్యవహరించబోతున్నారు? అధికార పార్టీ విమర్శలను ఎలా తిప్పికొట్టానున్నారు?

ఉచిత విద్యుత్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలు పైకి సమర్థిస్తున్నా లోపల పార్టీకి నష్టం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ వ్యాఖ్యలపై పిఏసి వేదికగా సీనియర్లు ఎలా వ్యవహరించబోతున్నారు? అధికార పార్టీ విమర్శలను ఎలా తిప్పికొట్టానున్నారు? రేవంత్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా? ఇంట్రస్టింగ్ పొలిటికల్ స్టోరీ మీకోసం..
తానా సభల్లో ఎన్నారైలు అడిగిన ప్రశ్నకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులే 95 శాతం ఉన్నారని ఒక్కో ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక్క గంట చాలు, మొత్తంగా 8 గంటలు ఉచిత విద్యుత్ సరిపోతుంది. కమిషన్ల కోసమే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు’ అంటూ అవినీతిపై చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలే తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారన్ని రేపుతున్నాయి. నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి భిన్నంగా స్పందిస్తున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని, రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పేరుతో భారీగా అవినీతి జరుగుతుందని రేవంత్ చెప్పే ప్రయత్నం చేసారని అంటున్నారు. దేశంలో మొదట ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో కూడా పెట్టామని చెబుతున్నారు.
లోలోపల ఆందోళన..
రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నా లోలోపల మాత్రం పెద్ద చర్చకు దారితిస్తుంది. రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని, పిఏసి లో చర్చించాల్సిందేనని విహెచ్ లాంటి సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఇటు కోమటిరెడ్డి సైతం రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని సరిదిద్దే ప్రయత్నం చేశారు. రేవంత్ ఎం మాట్లాడారనే దానిపై నేతలంతా ఆరా దిస్తున్నారు. రేవంత్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చర్చిస్తున్నారు.




రేవంత్ కాంట్రావర్సీ వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు.. ఆయన వ్యాఖ్యలు ఇటు నేతల మధ్య వైరుద్యాలను పెంచడంతో పాటు.. పార్టీకి సైతం పలుమార్లు ఇబ్బందులు కలిగేలా వ్యాఖ్యలు చేశారు. గతంలో రెడ్డి లే రాజ్యాధికారం ఉండాలని ఇతర సామజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడరని విమర్శలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో సొంత పార్టీ నేతలనే పార్టీ లైన్ దాటితే గోడకేసి కొడతానన్న వ్యాఖ్యలపై సీనియర్లు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు తానా సభల్లో సీతక్క సీఎం అయ్యే అవకాశం ఉంటుందనడం తెలంగాణలో కాంగ్రెస్ అంటే రేవంత్.. రేవంత్ అంటే కాంగ్రెస్ అనడం, తాజాగా ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
రేవంత్ విద్యుత్ అవినీతిపై మాట్లాడే ప్రయత్నం చేసినా.. అవి రివర్స్ తగలడంతో అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత రేవంత్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. తన వ్యాఖ్యలను సమర్తిస్తారా? లేక వెనక్కి తగ్గుతారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
