- Telugu News Photo Gallery Makeup Removing Tips: Removing makeup by natural method here is a simple tips for you in telugu
Makeup Removing Tips: మేకప్‌ను సహజంగా తొలగించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ మీకోసం..
చాలా మంది బయటకు వెళ్లేటప్పుడో, వేడుకలు హాజరైనప్పుడో.. స్పెషల్ అకేషన్ సందర్భాల్లోనో మేకప్ వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మేకప్ వేసుకుంటారు. ఆ మేకప్‌ను రాత్రి పడుకునే ముందు తీసేయాల్సి ఉంటుంది. సహజంగా ఈ మేకప్‌ను ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం..
Updated on: Jul 10, 2023 | 10:10 PM

మహిళలు ఏదైనా అకేషన్‌కు వెళ్లేటప్పుడు తాము అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. కొంతమంది పురుషులు కూడా వేసుకుంటున్నారు. ఎవరు వేసుకున్నా.. రాత్రి పడుకునే ముందు ఆ మేకప్ తీసేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మార్కెట్‌లో లభించే కెమికల్ మేకప్ రిమూవర్లను వాడుతుంటారు. దీనికి బదులుగా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో మేకప్‌ను తొలగించుకోవచ్చు. అదెలాగో ఇవాళ మనం తెలుసుకుందాం..

పాలను కూడా మేకప్ తొలగించడానికి ఉపయోగించవచ్చు. చిన్న గిన్నెలో పాలు తీసుకుని అందులో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడుచుకోవాలి.

తేనెను సహజమైన మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించవచ్చు. కాటన్ బాల్‌పై కొంచెం తేనె వేసి, ముఖంపై 5 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఆపై ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆవిరితో నిమిషాల్లో ముఖం నుండి మేకప్ తొలగించవచ్చు. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని ముఖాన్ని 5-10 నిమిషాలు ఆవిరి పట్టాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ లేదా కాటన్ బాల్‌తో ముఖాన్ని తుడిచి, మేకప్‌ను తొలగించుకోవచ్చకు. చర్మ రంధ్రాలు తెరుచుకోవడంతోపాటు ఇతర మురికి కణాలు కూడా పోతుంది.