- Telugu News Photo Gallery Technology photos WhatsApp Tips: How Many Devices Can I Use One WhatsApp Account
WhatsApp Tips: వాట్సాప్ అకౌంట్‌ని ఒకేసారి ఎన్ని డివైజ్‌లలో ఉపయోగించొచ్చు.. కీలక వివరాలు మీకోసం..
WhatsApp Tips: ఒకే వాట్సాప్ ఖాతాను నాలుగు కంటే ఎక్కువ పరికరాల్లో ఒకే సమయంలో ఉపయోగించడం సాధ్యం కాదు. దీనికి వాట్సాప్ ఇంకా అనుమతించలేదు. వినియోగదారులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు.
Updated on: Jul 10, 2023 | 9:51 PM

WhatsApp Tips: ఒకే వాట్సాప్ ఖాతాను నాలుగు కంటే ఎక్కువ పరికరాల్లో ఒకే సమయంలో ఉపయోగించడం సాధ్యం కాదు. దీనికి వాట్సాప్ ఇంకా అనుమతించలేదు. వినియోగదారులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు.

గత కొన్ని నెలల క్రితం వరకు మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉండగా.. ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లలో దానిని ఉపయోగించడానికి అవకాశం ఉండేది కాదు. అయితే, ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్రసిద్ధ మెసేజింగ్ అప్లికేషన్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.

వాట్సాప్ ఈ కొత్త ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఒకే సమయంలో నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించేందుకు వీలుంటుంది. అంటే నాలుగు ఫోన్లలో ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఒకేసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చన్నమాట.

నాలుగు కంటే ఎక్కువ డివైజ్‌లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను తెరిచి ఉండటం సాధ్యం కాదు.

వాట్సాప్ అకౌంట్‌ను వేరే ఫోన్‌లో వినియోగించాలనుకుంటే.. అందులో కొత్తగా వాట్సాప్ ఇన్‌స్టాల్ చేయాలి. ఆపై అకౌంట్ సెటప్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ నమోదు చేయడానికి బదులుగా, ‘ఎగ్జిస్టింగ్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఒకేసారి నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్.. మెసేజింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. అదనంగా, సైన్ అవుట్ చేయకుండా మరొక ఫోన్ నుండి సందేశాలు పంపడం, సగంలో నిలిచిపోయిన చాట్‌లను కొనసాగించడానికి సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

వ్యాపారులు ఈ ఆప్షన్ ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందుతుననారు. ఉద్యోగులు నాలుగు మొబైల్ ఫోన్‌లలో ఒకే ఖాతాను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లతో కమ్యూనికేట్ చేయడానికి వెసులుబాటు కలుగుతోంది.