Andhra Pradesh: మంత్రి విడదల రజినీ టార్గెట్‌గా గేమ్ స్టార్ట్ చేసిన మాజీ మంత్రి.. ఆ గేమ్ ఏంటో మీరే చూసేయండి..!
చిలకలూరిపేటలో అసలు ఆట మొదలైంది. మంత్రి విడదల రజిని టార్గెట్‌గా గేమ్ మొదలుపెట్టారు టీడీపీ లీడర్ ప్రత్తిపాటి. సీన్‌లోకి దిగడం దిగడమే రజినీకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
చిలకలూరిపేటలో అసలు ఆట మొదలైంది. మంత్రి విడదల రజిని టార్గెట్‌గా గేమ్ మొదలుపెట్టారు టీడీపీ లీడర్ ప్రత్తిపాటి. సీన్‌లోకి దిగడం దిగడమే రజినీకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ ఆ సవాల్ ఏంటి? ఆయన మొదలుపెట్టిన గేమ్ ఏంటి? ఇంట్రస్టింగ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కిపోతోంది. ప్రతి నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. మీరేం చేశారో… మేం చేశామో తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అలాంటి ఆటే ఇప్పుడు మొదలైంది. మంత్రి విడదల రజిని టార్గెట్‌గా గేమ్ మొదలుపెట్టారు టీడీపీ లీడర్ ప్రత్తిపాటి. సీన్‌లోకి దిగడం దిగడమే రజినీపై ఘాటు కామెంట్స్ చేశారు. రజినీకి వసూళ్లపై ఉన్న శ్రద్ధ… నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన పసుమర్రు వంతెన, ఓగేరు వాగు బ్రిడ్జి పనులను చూపిస్తూ సెల్ఫీ ఛాలెంచ్ సవాల్ విసిరారు ప్రత్తిపాటి.
సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం మినహా చిలకలూరిపేటకు మంత్రి రజిని చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. టీడీపీ ప్రభుత్వం… ఓగేరు వాగు బ్రిడ్జికి నిధులు సమకూర్చి పనులు ప్రారంభిస్తే, వైసీపీ సర్కార్ మాత్రం కనీసం పది శాతం కంప్లీట్ చేయలేదన్నారు. నాలుగేళ్లు దాటుతున్నా నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో విడదల రజిని చెప్పాలన్నారు ప్రత్తిపాటి. చిలకలూరిపేటలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా ముందుకెళ్తాయని సెటైర్లేశారు ప్రత్తిపాటి. మరి, ప్రత్తిపాటి సవాల్‌కు మంత్రి విడదల రజిని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..