AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR Birthday: కేటీఆర్ పుట్టినరోజున మంత్రి ఎర్రబెల్లి చేసిన మంచి పని.. ఏమిటో తెలుసా..

KTR Birtday Day: తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు , మంత్రుల దగ్గర నుంచి.

KTR Birthday: కేటీఆర్ పుట్టినరోజున మంత్రి ఎర్రబెల్లి చేసిన మంచి పని.. ఏమిటో తెలుసా..
Ktr Errabelli
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 24, 2021 | 6:50 PM

Share

KTR Birtday Day: తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు , మంత్రుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఓ మంచి పనిని చేయడానికి సంకల్పించారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ వంతుగా 105 మంది దివ్యాంగులకు మూడు చ‌క్రాల స్కూటర్ వాహనాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో మొదటి విడతగా దివ్యాంగులకు 5 మూడు చక్రాల స్కూటర్లు, రాయపర్తి మండల కేంద్రంలో 05 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ వాహనాలను పంపిణీ చేయడం జరిగిందని అని తెలిపారు. మిగతా త్రి చక్ర స్కూటర్లలను ఒక నెలలోగా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. దివ్యాంగులకు అందించే 105 త్రి చక్ర స్కూటర్లలను ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Also Read: Jowar Roti: ఆరోగ్యానికి మేలు చేసే జొన్న రోటీలు.. ప్రపంచంలో ఎన్ని దేశాలు జొన్నలను ఆహారంగా తీసుకుంటున్నాయో తెలుసా