AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By-Election: బాంబ్ పేల్చిన ఆర్ కృష్ణయ్య.. హుజూరాబాద్ బరిలో 1000 మంది..!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును అక్కడ వెయ్యి మందిని పోటీకి నిలుపుతామంటూ పటాకా పేల్చారు...

Huzurabad By-Election: బాంబ్ పేల్చిన ఆర్ కృష్ణయ్య.. హుజూరాబాద్ బరిలో 1000 మంది..!
R. Krishnaiah
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2021 | 6:54 PM

Share

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును అక్కడ వెయ్యి మందిని పోటీకి నిలుపుతామంటూ పటాకా పేల్చారు ఆర్ కృష్ణయ్య.  ఇప్పటి వరకూ ఎంతో సైలెన్స్ మెయిన్‌టైన్ చేసిన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు.  హుజూరాబాద్ ఉప ఎన్నికమీద స్పందించడం మాత్రమే కాదు.. హుజూరాబాద్‌ను ‘హజరతా బాద్’… అంటే వెయ్యి మందిని ఉపఎన్నిక నిలుపుతామని ప్రకటించారు. దీంతో ఎక్కడి అభ్యర్ధులక్కడే గప్ చుప్ అయిపోయారు. దీంతో ఇదెక్కడి గొడవ? అని తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి ఎన్నికల కారణంగా అక్కడి ఎన్నికల ఫలితాలు ఎంతటి ప్రభావితం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ తరహా ఎన్నిక వార్త హుజూరాబాద్ లోనూ వెలుగులోకి రావడంతో.. ఇదో చర్చగా మారింది.

కొన్నాళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించింది ప్రభుత్వం. తద్వారా 7600 మంది ఉపాధి కోల్పోయారని.. ఇందుకు తగిన సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఆర్ కృష్ణయ్య. వీరందరినీ విధుల్లోకి తీసుకోకుంటే తాము వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను.. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దింపుతామని హెచ్చరించారు. వీరితో పాటు ఇటీవల తొలగించిన స్టాఫ్ నర్సులు సైతం నామినేషన్లు వేసే అవకాశముందని హెచ్చరించారు కృష్ణయ్య. ఒక వేళ అదే జరిగితే.. న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లు, నీళ్ల డ్రమ్ముల సైజు బ్యాలెట్ బాక్సులు, గుర్తును పోలిన గుర్తులు, పేర్లను పోలిన పేర్లతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కాబట్టి.. ఇలాంటి పరిస్థితి రావద్దనే ఆశిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్ధులు.

Also Read:టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.

బూడిద గుమ్మడితో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు సుమీ..!

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్