AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.

గుంటూరు జిల్లాలో టీచర్ దంపతులపై దాడి కేసులో చిక్కుముడి వీడింది. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి.

Guntur: టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.
Attack On Teacher
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2021 | 6:35 PM

Share

గుంటూరు జిల్లాలో టీచర్ దంపతులపై దాడి కేసులో చిక్కుముడి వీడింది. సహ ఉపాధ్యాయురాలే తన భర్తతో కలిసి వీరిపై దాడి చేయించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే… గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు హైస్కూల్ టీచర్ దీపాల కృష్ణ ప్రసాద్‌, తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి హైస్కల్ ఇన్‌చార్జి  ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులపై ఇటీవల కొంతమంది యువకులు దాచేపల్లిలోని శ్రీనగర్‌ దగ్గర దాడి చేసి 5 తులాల బంగారం లాక్కెళ్లారు. దీంతో వెంటనే వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయం తెలిసింది. ఈ ఘటనకు దాడికి తెలంగాణలోని మిర్యాలగూడ ఏరియాకి చెందిన వారిగా గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ ఘటనలో వాడపల్లి హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయురాలి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. స్కూల్ టైమింగ్స్, రూల్స్ పాటించాలని పదే, పదే చెబుతూ వస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై ఆమె కోపం పెంచుకొని దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె భర్త ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ముందు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కూడా విచారించి పూర్తి స్థాయిలో నిజనిర్ధారణ అయిన అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

ట్విట్టర్‌లో బ్రహ్మాజీని ఉతికి ఆరేస్తున్న రానా, నాగశౌర్య.. మాములు ఫన్ కాదు…

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్