AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులు, ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ అధికారులు..

Telangana Weather Alert: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో అదికాస్తా అల్పపీడనంగా..

Telangana Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులు, ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ అధికారులు..
Weather Report Of Ts
Shiva Prajapati
|

Updated on: Jun 11, 2021 | 8:09 AM

Share

Telangana Weather Alert: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో అదికాస్తా అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు నైరుతి రుతుపవనాలు, ఇటు అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా శుక్రవారం, శనివారం నాడు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తండా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా వరదలు కూడా రావొచ్చని అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Also read:

Covid Third Wave: కొవిడ్ థర్డ్ వేవ్ భయాలు… వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Aadhaar Center: కొత్తగా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా ? ఎలా ఓపెన్ చేయాలి ? UIDAI సూచనలు..