Aadhaar Center: కొత్తగా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా ? ఎలా ఓపెన్ చేయాలి ? UIDAI సూచనలు..
Aadhaar Center: భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే.. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఆధార్ కార్డు. ఇది ఇప్పుడు ప్రతి పనిలోనూ భాగమైంది.
Aadhaar Center: భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే.. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఆధార్ కార్డు. ఇది ఇప్పుడు ప్రతి పనిలోనూ భాగమైంది. ప్రభుత్వ పథకాల దగ్గర్నుంచి.. విద్య, ఉద్యోగం, బ్యాంకు పనులు ఇలా ప్రతి పనిలో ఆధార్ ఉండాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఆధార్ లేకపోతే.. అత్యవసర పనులు సైతం ఆగిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మన ఆధార్ కార్డులో ఏవైన తప్పులు ఉన్నా.. లేదా కొత్తగా ఆధార్ కార్డు కోసం అప్లై చేయాలనుకున్నా.. వెంటనే ఆధార్ సెంటర్లకు పరిగెడుతుంటాం. 10 సంవత్సరాల క్రితం ఈ ఆధార్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఈ సౌకర్యం దేశంలోని పలు ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తర్వాత క్రమంగా మిగతా పట్టణాల్లో ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్లు ఓపెన్ అయ్యాయి. ఇక క్రమంగా ప్రభుత్వం కాకుండా.. ఆధార్ రిజిస్ట్రేషన్ కేంద్రాల ఫ్రాంచైజీలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో ఉందా ? లేదా ? అనేది తెలుసుకుందాం.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా.. తమ గ్రామానికి 10 కిలోమీటర్ల వరకు మండలం లేనందున యూఐడీఏఐ ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆధార్ కోసం ఫ్రాంచైజ్ ఇవ్వండి అని uidaiకి ట్వీట్ ద్వారా అభ్యర్థన పెట్టుకున్నాడు. అందుకుuidai స్పందిస్తూ.. ప్రస్తుతం ఆధార్ సేవ ప్రైవేటులో లేదని స్పష్టం చేశారు. ” ఆధార్ సేవలు బ్యాంకులు, పోస్టాఫీసులు, సీఎస్ఐసీలలో మాత్రమే లభిస్తాయి. సేవ కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు, యూఐడీఏఐ నిర్వహిస్తున్న ఆధార్ సేవ కేంద్రాలు ప్రైవేట్ గా పనిచేయవు. ఈ విషయంలో మరింత సమాచారం కోరకు రాష్ట్ర ప్రభుత్వ స్థానిక అధికారుల నుంచి తీసుకోవాలి. ” అని వివరించింది.
ట్వీట్..
Sir I want to take a UIDAI franchise because no anyone UIDAI franchise in my 10km area so I requested you that you give me a UIDAI franchise please@ceo_uidai @UIDAI @UIDAILucknow
— Sadik (@sadakat90379880) June 6, 2021
చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సెంటర్లకు ఆధార్ బోర్డ్ కనిపిస్తుంది. అలాగే చాలా మంది ఆధార్ లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఇతర వివరాలలో మార్పులు, ఫోటోలు మార్చడం, పీవీసీ కార్డు ముద్రించడం వంటి పనుల కోసం ఇంటర్నెట్ సెంటర్ల వరకు వెళతారు. అని నిజంగానే ఆధార్ సెంటర్స్ కావు. ఆధార్లో మార్పులను ప్రతి ఒక్కరు చేసుకునేలా యూఐడీఏఐ వెబ్ సైట్ అందిస్తోంది. అయితే టెక్నాలజీ వాడకం తెలియని వారు ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్ సెంటర్స్ వైపు వెళ్తుంటారు. అక్కడ పుట్టినతేదీని సరిచేయడం, పీవీసీ కార్డు పొందడానికి ఇంటర్నెట్ లో రూ.50 చెల్లంచాలి.. కానీ అక్కడివారు సామాన్యుల నుంచి రూ.70 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తారు. దీంతో ఇంటర్నెట్ సెంటర్ల వారు మీ నుంచి రూ.30 నుంచి 50 లేదా 100 రూపాయాలను కూడా లాభం పొందుతాడు.
Also Read: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక…జూన్ 30 లోపు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే.. లేదంటే ఇబ్బందులు తప్పవు…