బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక…జూన్ 30 లోపు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

ప్రస్తుతం కరోనా పరిస్థితులలో బ్యాంకులు కొన్ని సర్వీసులలో పలు మార్పులు చేశాయి. అంతేకాకుండా.. మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక...జూన్ 30 లోపు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే.. లేదంటే ఇబ్బందులు తప్పవు...
Banks

ప్రస్తుతం కరోనా పరిస్థితులలో బ్యాంకులు కొన్ని సర్వీసులలో పలు మార్పులు చేశాయి. అంతేకాకుండా.. మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలాగే ప్రతి కస్టమర్ తమ అకౌంట్ ఖాతాకు ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం చేయడం కూడా బ్యాంకులు తప్పనిసరి చేశాయి. అలాగే కేవైసీ అప్‏డేట్…ప్రత్యేకమైన స్కీమ్స్ అందించడం వంటి పనులను తప్పనిసరి చేశాయి. వీటి కోసం జూన్ 30 వరకు గడువు ఇచ్చాయి. ఈ తేదీలోపు కొన్ని బ్యాంకు పనులు చేయకపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ జూన్ 30 లోపు కచ్చితంగా చేయాల్సిన పనులెంటో తెలుసుకుందాం.

ఆధార్ కార్డుకు పాన్ కార్డ్ లింక్ చేసుకోవడానికి జూన్ 30 వరకు మాత్రమే గడువు ఉంది. అంటే తేదీ దాటితే ఈ రెండింటినీ లింక్ చేసుకోలేరు. అలాగే పాన్, ఆధార్ లింక్ చేసుకోకపోతే.. మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అంతేకాకుండా.. రూ.1000 పెనాల్టీ కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది.

అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకులు ప్రత్యేక స్కీమ్స్ రూపంలో అధిక వడ్డీ రేటు అందిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ఎస్బీఐ దగ్గరి నుంచి హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ప్రత్యేక ఎఫ్ డీ స్కీమ్స్ అందిస్తున్నాయి. ఇవి కూడా జూన్ 30 వరకే అందుబాటులో ఉంటాయి.

ఇక సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కస్టమర్లు కూడా నిర్ణిత సమయంలోపు కోన్ని పనులు చేయాలి. ఇటీవల సిండికేట్ బ్యాంక్ కెనరాలో విలీనం అయ్యింది. అందువలన ఈ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు జూలై 1 నుంచి పని చేయవు. అలాగే చెక్ బుక్స్ కూడా చెల్లుబాటు కావు. అందుకే వీలైనంత తొందరగా చెక్ బుక్ మార్చుకోవాలి.. కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ పొందండి..

Also Read: Pushpa Movie: ‘పుష్ప’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్… బన్నీ కోసం రంగంలోకి చిరు.. ఒకే ఫ్రేమ్‏లో అలా..

Mumbai New Airport: కళ్లు జిగేల్‌ అనేలా నవీ ముంబై నూతన అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్.. వీడియో విడుదల..