TSRTC: టీఎస్ఆర్టీసీకి వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై మంత్రి పువ్వాడ పూర్తి స్థాయి సమీక్ష
బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ సంస్థకు నెల నెలా సమకూర్చడం జరుగుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ
Puvvada Ajay Kumar: బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ సంస్థకు నెల నెలా సమకూర్చడం జరుగుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ అర్థికాంశాలపై మంత్రి ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో మంత్రి పూర్తి స్థాయిలో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంస్థకు రూ.1500 కోట్లు, అదనంగా మరో రూ.1500 కోట్లు బడ్జెటేతర నిధులగా కేటాయించిన విషయం తెలిసిందేనన్నారు మంత్రి అజయ్.
స్ఫెషల్ చీఫ్ సెక్రటరీ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి, సంస్థ ఆర్థిక సలహాదారు రమేశ్, ఇతర ఉన్నతాధికారులు భేటీకి హాజయ్యారు.