Sister Suicide: రక్షాబంధన్ రోజున ఆ కుటుంబంలో విషాదం.. అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..!
Sister Suicide: రాఖీ పండగ పర్వదినం రోజు అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్నలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు, అక్కలు రాఖీలు కట్టి పండగను ఘనంగా..
Sister Suicide: రాఖీ పండగ పర్వదినం రోజు అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్నలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు, అక్కలు రాఖీలు కట్టి పండగను ఘనంగా జరుపుకొంటారు. కానీ రక్షాబంధన్ రోజున ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం పెంచాల్సిన రాఖీ పండగ కన్నీరు మిగిల్చింది. జహీరాబాద్ పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో అన్న రాఖీ కట్టించు కోలేదని చెల్లి మమత (20) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రాఖీ కట్టేందుకు మమత ఇంటికి వెళ్లగా, రాఖీ కట్టించుకునేందుకు అన్న నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తానానికి గురైన చెల్లి ఇంట్లోనే ఆత్మహత్యకు ఒడిగట్టింది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. చెల్లి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాఖీ కట్టించుకోలేదనేనా..? లేక ఇంకేమైన కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రక్షాబంధన్ రోజు సంతోషాలు నిండాల్సిన ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో పలువురు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, అన్నా చెల్లి మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నాయో తెలియదు గానీ.. పండగ రోజున నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ పండగ కారణంగా అన్నా.. చెల్లెల మధ్య అనురాగాలు, ఆప్యాయత, ప్రేమానురాగాలు పెరగాల్సిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.