Nagar Kurnool: రాఖీ పండుగ రోజే అమ్మకు దూరమైన నవజాత శిశువు.. చెత్త కుప్పలో ఆడబిడ్డ.. స్థానికులు ఏంచేశారంటే?
ఆడ పిల్ల పుట్టిందనో, పుట్టుకే భారమైందనో, లేక మరే కారణాలో తెలియదు కానీ.. పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులు వదిలించుకుంటున్నారు. చెత్త కుప్పల్లో వదిలిపెడుతున్నారు తల్లిదండ్రులు.
Abandoned a New Born Baby: ఆడ పిల్ల పుట్టిందనో, పుట్టుకే భారమైందనో, లేక మరే కారణాలో తెలియదు కానీ.. పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులు వదిలించుకుంటున్నారు. చెత్త కుప్పల్లో వదిలిపెట్టే తల్లిదండ్రులు కొందరైతే.. పుట్టుకతోనే చంపేసి ఎక్కడో విసిరేయడం మరొకరు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డంపింగ్ యార్డ్ లో అప్పుడే పుట్టిన ఆడశిశువును పడవేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. రాఖీ పండగ రోజే ఆడ శిశువు పట్ల వివక్ష కంటతడి పెట్టిస్తోంది. అప్పుడే పుట్టిన శిశువుని సంచిలో మూట కట్టి డంపింగ్ యార్డులో పడవేసి గుట్టుగా జారుకున్నారు దుర్మార్గులు. శిశువు ఏడుపులు విని అటుగా వెళ్తున్న వ్యక్తులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
దీంతో పట్టణానికి చెందిన ఎస్ఐ విజయ్ కుమార్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ఆడశిశువును చేరదీశారు. శిశువుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆడబిడ్డ ప్రాణాలతో బయట పడింది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పసికందు పట్ల కసాయిగా ప్రవర్తించిన వారిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు వద్దనుకున్న వారు ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పాలని ఎంత చెప్పినా కొంత మంది వినడం లేదు. కనికరం లేకుండా శిశువులను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. ఇది అమానవీయమని.. ఆడ పిల్లల పట్ల ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. ఆడ శిశువు ద్దనుకున్న వారు ఐసీడీఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఉయ్యాల లో వదిలి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.
Read Also…
MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు