Viral Video: అల్లారుముద్దుగా పెంచుకున్న పాములకు చెల్లితో రాఖీ కట్టించిన అన్నయ్య.. అంతలోనే ఊహించని షాక్

విష సర్పంతో సయ్యాట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా పనితో చావు కొని తెచ్చుకున్నాడు. రాఖీ వేళ అందరిలానే ఆ అన్నయ్య కూడా చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు.

Viral Video: అల్లారుముద్దుగా పెంచుకున్న పాములకు చెల్లితో రాఖీ కట్టించిన అన్నయ్య.. అంతలోనే ఊహించని షాక్
Snake Bite While Tying Rakhi In Bihar
Follow us

|

Updated on: Aug 22, 2021 | 10:32 PM

Snake Bite tying Rakhi: విష సర్పంతో సయ్యాట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా పనితో చావు కొని తెచ్చుకున్నాడు. రాఖీ వేళ అందరిలానే ఆ అన్నయ్య కూడా చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు. అంతేకాదు తాను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే పాములకు కూడా చెల్లితో రాఖీ కట్టించాలనుకున్నాడు. ఆ కోరికే అతడి ప్రాణం తీసింది. ఒక పాముకు అతడి చెల్లి రాఖీ కడుతుంటే అక్కడే మరో పాము అతడి కాలిపై కాటువేసింది. క్షణాల్లోనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు. ఇలా రాఖీ పండగ రోజే.. చెల్లి కళ్లు ముందే.. అన్నయ్య చనిపోయాడు. బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాఖీ పండుగ పూట ఆ కుటంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.

ఇక, వివరాల్లోకి వెళ్తే… సారణ జిల్లాలోని శీతల్‌పూర్ గ్రామానికి చెందిన దిగంబర్ సాహా, మంజు కున్వార్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ముగ్గురు అన్నాదమ్ముళ్లలో మన్మోహన్(24) రెండో వాడు. వృత్తిరీత్యా రైతు అయిన మన్మోహన్.. అదే గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వ్యవసాయంతో పాటు పాములంటే మన్మోహన్‌కు ఎంతో ఇష్టం. పాములను మచ్చిక చేసుకోవడంలో దిట్ట. గ్రామంలోకి ఎలాంటి పాములు వచ్చిన ఇట్టే పట్టుకుని మచ్చిక చేసుకుంటాడు. అందరూ ఇంట్లో పిల్లులు, కుక్కలను పెంచుకుంటే.. మన్మోహన్ మాత్రం పాములను పెంచుకుంటున్నాడు. నాగు, నాగిని జంటను కన్నపిల్లల్లా సాదుతున్నాడు. పామును వన్యప్రాణిలా కాకుండా సొంత కుటుంబ సభ్యుడిలా.. అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు.

ఇదే క్రమంలో ఆదివారం రాఖీ పండగ కావడంతో మన్మోహన్ చెల్లి సులోచన అతడికి రాఖీ కట్టింది. అయితే, తనతో పాటు నాగుపాముకు కూడా రాఖీ కట్టాలని.. అతడు కూడా మీ తమ్ముడే కదా.. చెల్లితో చెప్పాడు. అన్న విజ్ఞప్తి మేరకు నాగుకు కూడా సులోచన రాఖీ కట్టింది. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న నాగిని మెల్లగా మన్మోహన్ కాలిపై కాటువేసింది. పాము కాటు వేసినా అతడు లైట్ తీసుకున్నాడు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి విషమించింది. అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే మన్మోహన్ కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మన్మోహన్ కన్నుమూశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చెల్లితో రాఖీ కట్టించుకున్న మన్మోహన్ కాసేపటికే పాము కరించి మరణించడంతో.. రాఖీ పండగ వేళ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇది తన జీవితంలో చీకటి రోజని మన్మోహన్ చెల్లి సులోచన కన్నీరు మున్నీరయింది. తను ఇక ఎప్పటికీ రాఖీ పండగను ఆనందంగా జరుపుకోలేనని.. తన అన్నయ్య మరణం జీవితాంతం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని విలపించింది.

Read Also… Viral Video: అమ్మో.. ఇది స్పైడర్ మెన్‌ను మించిపోయిందిరోయో… సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కోతి దూకుడు

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి