Telangana Home Minister: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్
Telangana Home Minister:తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. త్వరలోనే పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని..
Telangana Home Minister:తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. త్వరలోనే పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని హోమ్ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. 20 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నామని తెలిపారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్ శాఖలో వివిధ వివిభాగాల్లో దాదాపు 80వేల మందిని నియమించుకున్నామన్నారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ.. 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు హోమ్ మంత్రి అలీ.
మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్‌ను రిసెప్షనిస్ట్‌గా నియమించడం వంటి అనేక నియామకాలు చేపట్టి.. సామాన్యులకు పోలీస్ వ్యవస్థను మరింత దగ్గరగా చేశామని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొత్త రాష్ట్రంలో పోలీస్ శాఖకు కొత్త వాహనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ సమర్థ పోలీసింగ్‌ను నిర్వహిస్తోందన్నారు. శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు హోంమంత్రి.
తెలంగాణాలో భారీ సంఖ్యలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశామమని చెప్పారు. వీటి సంఖ్య దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయని.. వీటి సాయంతో కేసులను ఈజీగా చేధిస్తున్నారని .. ఇంకా చెప్పాలంటే ఈ సీసీ కెమెరా ఏర్పాట్లతో నేరాలు చేయాలంటే భయపడుతున్నారని చెప్పారు హోమ్ మంత్రి అలీ. అంతేకాదు గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయం నుంచి పోలీసులు నిర్వహిస్తున్న విధులు.. వారి త్యాగం గొప్పదని ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read: ప్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ లో సంచలనం .. టైటిల్ విజేతగా నిలిచిన 33వ సీడెడ్ బార్బొరా క్రెజికోవా…