French Open 2021:ప్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ లో సంచలనం .. టైటిల్ విజేతగా నిలిచిన 33వ సీడెడ్ బార్బొరా క్రెజికోవా

Barbora Krejcikova: ప్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ లో సంచలనం నమోదైంది. ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి..

French Open 2021:ప్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ లో సంచలనం .. టైటిల్ విజేతగా నిలిచిన 33వ సీడెడ్ బార్బొరా క్రెజికోవా
Barbora Krejcikova
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2021 | 6:06 AM

Barbora Krejcikova: ప్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ లో సంచలనం నమోదైంది. ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రేజికోవా (25) టైటిల్ విజేతగా అవతరించింది. టోర్నీ ఫైనల్‌లో రష్యా స్టార్‌ పల్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో క్రెజికోవా విజయం సొంతం చేసుకుంది. తన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను క్రెజికోవా గెల్చుకుంది.

ఇప్పటి వరకూ ఏ గ్రాండ్ స్లామ్ లోనూ కనీసం 4వ రౌండ్ దాటని.. 33వ ర్యాంకర్‌ బార్బోరా క్రేజికోవా సిరీస్ లో ఎటువంటి అంచనాలు లేకుండా అడుగు పెట్టింది. అయితే ఫైనల్ పోటీలో టైటిల్ ను సులభంగా సొంతం చేసుకుంది.

సెమి ఫైనల్ లో కష్టపడి విజయం సొంతం చేసుకుంది.ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో గ్రీస్ క్రీడాకారిణి మరియా సక్కారి పై 7-5, 4-6, 9-7తో విజయం సాధించి..52వ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే ఫైనల్ లో ఎటువంటి ప్రతిఘటన లేకుండానే సులభంగా విజయం సొంతం చేసుకుంది

Also Read:  యూరో కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఘోరం.. ఆట మధ్యలో కుప్పకూలిన డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్..