AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీ లోక్ సభ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ఇదేనా.. రాష్ట్ర జాబితాపై ఢిల్లీ పెద్దల నిర్ణయమేంటి..

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిటీకి పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన లిస్ట్‎ను బీజేపీ పంపించింది. తెలంగాణలోని పది పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను వచ్చేవారం విడుదల చేయనున్నారు బీజేపీ పెద్దలు. ఫస్ట్ లిస్ట్‎లో ఛాన్స్ కొట్టేసే ఆ నాయకులు ఎవరు?

Telangana: బీజేపీ లోక్ సభ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ఇదేనా.. రాష్ట్ర జాబితాపై ఢిల్లీ పెద్దల నిర్ణయమేంటి..
Telangana BJP
Sridhar Prasad
| Edited By: Srikar T|

Updated on: Feb 01, 2024 | 12:05 AM

Share

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిటీకి పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన లిస్ట్‎ను బీజేపీ పంపించింది. తెలంగాణలోని పది పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను వచ్చేవారం విడుదల చేయనున్నారు బీజేపీ పెద్దలు. ఫస్ట్ లిస్ట్‎లో ఛాన్స్ కొట్టేసే ఆ నాయకులు ఎవరు? లోక్ సభ ఎన్నికలపై కమలనాథుల వ్యూహమేంటీ ? తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడానికి కాషాయ పార్టీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేని లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్, కరీంనగర్, నిజమాబాద్ పార్లమెంట్ స్థానాలను సిట్టింగ్‎లకే కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లనే రాష్ట్ర పార్టీ.. కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు సమాచారం.

చేవెళ్ల, మహబూబ్‎నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు రెండేసీ పేర్లతో రాష్ట్ర నాయకత్వం.. కేంద్రానికి జాబితాను పంపించింది. మల్కాజిగిరి, జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం అధిక సంఖ్యలో ఆశావాహులు ఉండటంతో ఆ పార్లమెంట్ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఆదిలాబాద్‎లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోదించాలని భావిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో బీజెపీ బలహీనంగా ఉంది. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తీసుకుని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు చర్చిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్‎గా ఉన్న నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ స్థానాలను గెలిచేందుకు బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదపాలని భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం వెలువడితే ఈ మూడు స్థానాలను కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో ఏడు స్థానాలను బీజేపీ తొలి జాబితాలో విడుదల చేసే అవకాశముంది. సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసుకుంటూ టికెట్ల కేటాయింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 5 స్థానాలకు తగ్గకుండా కేటాయించనున్నట్లు సమాచారం. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా మూడు స్థానాలకు తగ్గకుండా కేటాయించాలని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ కంటే 20 రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి కమలనాథుల ఈక్వేషన్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..