Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: సంబరంలో కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్‌కు రక్షణగా పోలీసులు

హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకునే కుమారి అనే మహిళ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో ఎక్కడ చూసినా ఆమెనే కనిపించింది. గత కొన్నేళ్లు నుంచి ఈమె షాప్‌ నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Kumari Aunty: సంబరంలో కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్‌కు రక్షణగా పోలీసులు
Kumari Aunty
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 31, 2024 | 1:08 PM

ఇన్‌ఆర్బిట్‌మాల్‌ సమీపంలో ఉన్న ITC కోహినూర్‌ దగ్గర్లో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌‌ ఉంటుంది..సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆమె ఫేమస్ అయ్యింది.కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేయడానికి జనంతో పాటు, ఫుడ్ వ్లాగర్స్..అలాగే సినీ తారలు సైతం ప్రమోషన్స్ కోసం ఆంటీ వద్దకు వస్తుండటంతో మరింత క్రేజ్ చేకూరింది.ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారీ ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు.

ఇదంతా సంచలనంగా మారడంతో CMO జోక్యం చేసుకుంది. ఆమె యధావిధిగా అక్కడే ఫుడ్‌ ట్రక్‌ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది..అంతేకాకుండా త్వరలో కుమారిఆంటీ షాప్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లే చాన్స్‌ కూడా ఉంది. ఈ క్రమంలో తనకు పర్మిషన్ ఇవ్వడంపై కుమారీ ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. తమ పక్షాన నిలిచినిందకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. తాము కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటామని.. ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా.. ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు.

కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో.. జనాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. భారీగా పబ్లిక్ చేరుకోవడంతో కుమారి ఆంటీకి రక్షణ కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం త్వరలో  ఆ ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..