Election Commission: ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ..

Voter list revision schedule: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌‌ను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు

Election Commission: ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ..
Telangana State Election Commission
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 06, 2021 | 7:52 AM

Voter list revision schedule: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌‌ను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఇంటింటి సర్వే, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ కొనసాగుతాయని తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ఇలా..

➼ 2021 నవంబర్‌ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. ➼ నవంబర్‌ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం. ➼ డిసెంబరు 20 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు, వినతుల పరిష్కారం. ➼ 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ➼ 2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురణ. ➼ 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటు హక్కుకు అర్హులు. ➼ www.nsvp.in ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం.

ఈ షెడ్యూల్ ప్రకారం.. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు ఓటు హక్కుకు దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం విడుతల వారీగా జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:

Hyderabad: మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు యువతులు సహా 8 మంది అరెస్ట్

Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..