AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాగుట్ల మనమే తోపు..లిక్కర్ సేల్స్‌లో తగ్గేదేలే..!

సౌత్ ఇండియాలోనే లిక్కర్ సేల్స్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. సౌత్ ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ఎక్కువ కొనుగోలు అవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీర్లుకు రూ.302.84 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు.

Telangana: తాగుట్ల మనమే తోపు..లిక్కర్ సేల్స్‌లో తగ్గేదేలే..!
Liquor Sales
Velpula Bharath Rao
| Edited By: |

Updated on: Nov 01, 2024 | 12:36 PM

Share

తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. సౌత్ ఇండియాలోనే లిక్కర్ సేల్స్‌లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో గత ఏడాది సగటున ఒక్కొక్కరు రూ.1,623 మద్యం కోసం ఖర్చు చేయగా… ఏపీలో రూ.1,306 ఖర్చు చేసినట్లు ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ) వెల్లడించింది. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది.

పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మద్యంపై తక్కువ ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికిపైగా బార్లు, పబ్స్ ఉన్నాయి. దసరాకు దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. సౌత్ ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ఎక్కువ కొనుగోలు అవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీర్లుకు రూ.302.84 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 169 బీర్ల అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో మద్యం అమ్మకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్నికి భారీ ఆమ్దాని వస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us