Telangana: బీఆర్ ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ పార్టీతో లాభం వీరికేనంట..

తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్ పై తీవ్ర చర్చసాగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి అరంగ్రేటం కోసం టీఆర్ ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి ( బిఆర్ ఎస్ ) పార్టీని ప్రకటించారు. ఈ పార్టీని గుర్తించాలని కోరుతూ..

Telangana: బీఆర్ ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ పార్టీతో లాభం వీరికేనంట..
Congress Laeder V. Hanumantha Rao
Follow us

|

Updated on: Oct 06, 2022 | 3:39 PM

తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్ పై తీవ్ర చర్చసాగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి అరంగ్రేటం కోసం టీఆర్ ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి ( బిఆర్ ఎస్ ) పార్టీని ప్రకటించారు. ఈ పార్టీని గుర్తించాలని కోరుతూ టీఆర్ ఎస్ కీలక నాయకుడు మాజీ ఎంపీ వినోద్ నేతృత్వంలోని బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు. కేసీఆర్ జాతీయ పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ మాత్రం బీఆర్ ఎస్ పై ఆచీతూచీ స్పందిస్తోంది. బీఆర్ ఎస్ పై అధికంగా స్పందిచవద్దని, ఆ పార్టీ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా స్పందన చూసిన తర్వాత స్పందించాలన్న కేంద్ర నాయకత్వం సూచనల మేరకు స్థానిక బీజేపీ నాయకులు ఘాటైన విమర్శలు చేయడం లేదు. బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రమే కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్ పై స్పందించారు. ఆయన మినహా మిగిలిన రాష్ట్రస్థాయి నాయకులు ఎవరూ పెద్దగా విమర్శలు చేసిన దాఖలలు లేవు. అయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ వలన ఎటువంటి లాభం లేదని, కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హెచ్.హనుమంతురావు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్ పై స్పందించారు. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ ఎస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బీ టీమ్ అంటూ విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమేనన్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా అని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని వి.హనుమంతురావు విమర్శించారు. దేశంలో కేసీఆర్ కు ఏ పార్టీ కూడా సహకరించదని జోస్యం చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తారని ఆరోపించారు. కేసీఆర్ ను దేశం మొత్తం పిలుస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలు పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ నాయకులకు అసలు విషయం తెలిసినా, కేసీఆర్ మెప్పు కోసం కొంతమంది నాయకులు తహతహలాడుతున్నారని విహెచ్ విమర్శించారు.

బీజేపీ కి లాభం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో రైతుల గురించి మాట్లాడుతున్న సీఏం కేసీఆర్ తెలంగాణలో రైతులను పట్టించుకోలేదన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో ఇతర రాష్ట్రాల రైతులకు పంచారని, ప్రజల సొమ్ముతో విమానాలు కొంటున్నారంటూ విహెచ్ విమర్శించారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ .. దేశంలో ఏదో చేస్తానంటే ఎవరు నమ్మబోరన్నారు. కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే జాతీయ పార్టీ అని ప్రకటించారని, తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కే సొంతమంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు వి.హనుమంతురావు.

ఇవి కూడా చదవండి

అలయ్ బలయ్ కార్యక్రమంలో విహెచ్ సందడి

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఆయన డప్పు కొడుతూ.. అక్కడి వారందరిని ఆకట్టుకున్నారు. తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో ఆలింగనం చేసుకుంటూ అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా.. బీజేపీలో ఉన్నసమయంలో బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన గవర్నర్ హోదాలో ఉండటంతో ఆయన వాసరత్వంగా వారి కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా హాజరై సందడి చేశారు.

హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..