AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణ RTC ఉద్యోగులకు 2.5% డీఏ పెంపును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 600 బస్సులు మహిళా సమైక్య సంఘాలకు అద్దెకు ఇవ్వనున్నారు. మొదటి దశలో 150 బస్సులు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు దోహదం చేయనున్నారు. మహిళా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!
Ponnam Prabhakar
SN Pasha
|

Updated on: Mar 07, 2025 | 10:40 AM

Share

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2.5 శాతం డీఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల రూ.3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగినా వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది.

మహిళా సమైక్య సంఘాల చేతే బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపిస్తూ మహిళలు ఆదాయాన్ని అర్జించేలా చేయాలని భావించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో పాటు అధికారులతో పలుమార్లు ఈ అంశంపై చర్చించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టి బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగగా రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య ల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డిమాండ్ ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.