AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. కాల్ సెంటర్ తో విదేశీయుల బ్యాంక్ ఖాతా హ్యాక్

ఎక్కడో విదేశాల్లో ఉన్నవారిని సైతం మోసగించి హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో వారి దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫేక్ కాల్ సెంటర్ బాగోతాన్ని సైబర్ సెక్యూరిటీ పోలీసుల బట్టబయలు చేశారు. ఏకంగా 63 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పేపాల్ అనే లావాదేవీల సంస్థకు సంబంధించిన కాల్ సెంటర్ గా చెప్పుకుంటూ యూఎస్ సిటిజెన్స్ ను మోసం చేస్తున్న కాల్ సెంటర్ ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు క్లోజ్ చేయించారు.

Hyderabad: హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. కాల్ సెంటర్ తో విదేశీయుల బ్యాంక్ ఖాతా హ్యాక్
Cyber Fraud Racket BustedImage Credit source: Social media
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 07, 2025 | 1:19 PM

Share

హైటెక్ సిటీ కేంద్రంగా గుర్తు చప్పుడు కాకుండా కేవలం రాత్రి వేళల్లోనే పనిచేస్తున్న కాల్ సెంటర్ పై సైబర్ సెక్యూరిటీ పోలీసులు దాడులు చేశారు. ఆత్యాధునిక లాప్టాప్ లు, ఖరీదైన మొబైల్ ఫోన్లో ఆకర్షణమైన ఐడి కార్డులు ఉపయోగించి అమెరికాలో ఉన్న పే పాల్ కస్టమర్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. హైటెక్ సిటీ వేదికగా ఒక చిన్న రూమ్ను రెంటుకు తీసుకొని కాల్ సెంటర్ ను స్థాపించారు. జనవరిలో మొదలైన ఈ కాల్ సెంటర్లో 63 మంది టెలికాలర్లలో పనిచేస్తున్నారు. వీరంతా నార్త్ ఇండియాకు సంబంధించిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. సోషల్ మీడియాలో టెలికాలర్స్ రిక్వైర్మెంట్ పేరుతో ప్రకటనలు జారీ చేయటంతో చాలామంది నార్త్ ఇండియాకు సంబంధించిన వారు ఈ ప్రకటనను చూసి ఇక్కడ చేరారు. వీరికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఏ తరహా లో యూఎస్ సిటిజెన్సును టార్గెట్ చేయాలి… ఎలా వారి నుంచి ఎకౌంటు వివరాలు తెలుసుకోవాలి అనే దానిపై పూర్తి శిక్షణ ఇచ్చిన తరువాత ప్రతిరోజు ఒక 30 కాల్స్ చేయాలంటూ ఒఒకొక్క టెలికాలర్ కు టార్గెట్ విధిస్తారు. ఒక రోజులో అందరూ టెలి కాలర్స్ నుంచి సుమారు 600కు పైబడి కాల్స్ అమెరికన్ సిటిజన్స్ కు వెళ్తున్నాయి. అయితే వీరి వద్ద పేపాలకు సంబంధించిన వినియోగదారుల డేటాఎలా వచ్చింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా దుబాయ్ లో ఉన్న ఒక నిందితుడి నుంచి ఈ డేటాను కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డేటా లో ఉన్న పేపాల్ వినియోగదారులకు తమ ఖాతాలోని డబ్బు డెబిట్ అయినట్లు నకిలీ సెంటర్ నుంచి ఒక మెసేజ్ పంపిస్తారు.

ఒకవేళ లావాదేవీ జరుగుతుంటే వెంటనే పలానా నెంబర్ కి ఫోన్ చేయండి అంటూ వీరి ఫోన్ నెంబర్ ను అక్కడ జతపరుస్తారు. ఇది నిజమైన మెసేజ్ ఏమోనని నమ్మిన అమెరికన్ సిటిజన్ వెంటనే వీరిని సంప్రదిస్తారు. ఆ డబ్బు రిఫండ్ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలి అంటూ వారిని ఒక ట్రాన్సలోకి తీసుకెళ్లి చెల్లింపులు చేపడుతున్నారు. ఇలా అమెరికా సిటిజెన్స్ ను టార్గెట్ చేస్తూ వారి డేటాను అపహరించి దానితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.

ఇందులో టెలికార్స్ గా పని చేస్తున్న వారికి సైతం సైబర్ నేరం చేస్తున్నాం అని తెలిసినప్పటికీ వారు 30 వేల రూపాయల జీతం కోసం ఆశపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతోపాటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఈ టెలీకాలర్స్ అందర్నీ పగడ్బందీగా చూసుకుంటూ వచ్చారు. మాదాపూర్ లోని ఒక హాస్టల్ ని రెంటుకు తీసుకొని ఈ 63 మందిని ఒకే దగ్గర ఉంచి కేవలం వీరు బుక్ చేసిన క్యాబ్ ల్లో మాత్రమే వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. అలా మొత్తం 63 మందికి విదేశాల్లో ఉన్న పేపాల్ కస్టమర్స్ ను ఎలా ట్రాప్ చేసి నేరాలకు పాల్పడాలో ట్రైన్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో బాధితులు మొత్తం అమెరికన్ సిటిజెన్సీ కావటంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు త్వరలోనే యూఎస్ కాన్సిలేట్ కు ఉత్తరం రాయనున్నారు. మరోవైపు పేపాల్ యాజమాన్యాన్ని సైతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అలర్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us