AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2025: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. హోలీ రోజున గాడిదపై కొత్త అల్లుడి ఊరేగింపు..

దేశవ్యాప్తంగా హోలీ జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. హోలీ వేడుకలను వివిధ సంప్రదాయాల్లో జరుపుకుంటారు. అలాంటి వింత సంప్రదాయం మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఉంది. ఇక్కడ లీ పండుగను చాలా విచిత్రమైన రీతిలో జరుపుకుంటారు. ఈ గ్రామంలోని గ్రామస్తులు తమ ఇంటి కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి.. గ్రామం మొత్తం ఊరేగిస్తారు. అనంతరం రంగులతో హోలీ వేడుకలను జరుపుకుంటారు.

Holi 2025: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. హోలీ రోజున గాడిదపై కొత్త అల్లుడి ఊరేగింపు..
Holi Celebration 2025
Surya Kala
|

Updated on: Mar 07, 2025 | 10:30 AM

Share

ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజుని హోలీ పండుగగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 14న జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు రెడీ అవుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడి జన్మించిన మధుర, నడయాడిన బృందావనం ప్రాంతంలో జరిగే హోలీ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాల్లో మాత్రమే కాదు దేశంలోని వివిధ నగరాల్లో హోలీ వేడుకలను వివిధ సంప్రదాయాల్లో జరుపుకుంటారు. అయితే భారతదేశంలోని ఒక గ్రామంలో హోలీ పండుగను వింతగా జరుపుకుంటారు. ఈ విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రోజు హోలీని వింతగా జరుపుకునే ఈ గ్రామం గురించి తెలుసుకుందాం..

అల్లుడిని గాడిదపై కూర్చొని గ్రామం మొత్తం ఊరేగింపు

మహారాష్ట్రలో బీడ్ అనే జిల్లాలో విడా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హోలీ చాలా ప్రత్యేకమైనది. హోలీ రోజున ఈ గ్రామంలో కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి గ్రామం మొత్తం చుట్టి తిప్పే సంప్రదాయం ఉంది. ఈ గ్రామ ప్రజలు 86 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ గ్రామంలో కొత్త అల్లుడిని ఎంపిక చేసి తర్వాత హోలీ రోజున ఊరేగింపుని మొదలు పెడతారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేకమైన హోలీని పోటెత్తే ప్రజలు

కొత్త అల్లుడి కోసం అన్వేషణ పూర్తయిన తర్వాత ప్రజలు అతన్ని హోలీ రోజున ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. హోలీ రోజున కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెడతారు. తరువాత రంగు వేస్తారు. దీని తరువాత గాడిదపై ఉన్న అల్లుడిని గ్రామం మొత్తం చుట్టి తీసుకువెళతారు. ఊరి ప్రజలు కొత్త అల్లుడికి రకరకల బహుమతులు ఇస్తారు. విడా గ్రామంలో జరిగే ఈ ప్రత్యేకమైన హోలీని, గాడిదపై స్వారీ చేసే అల్లుడిని చూడటానికి సమీప ప్రాంతాల నుంచి మాత్రమే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు.

ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం దాదాపు 86 సంవత్సరాల క్రితం బీడ్ జిల్లాలోని విడా గ్రామంలో దేశ్‌ముఖ్ కుటుంబం నివసించేది. హోలీ రోజున దేశ్‌ముఖ్ కుటుంబం కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చారు. అల్లుడు రంగులు పూసుకుని హోలీ ఆడటానికి నిరాకరించాడు. దీని తరువాత మామగారు తన అల్లుడిని అనేక విధాలుగా చెప్పి అల్లుడు అంగీకరించిన తర్వాత మామగారు పూలతో అలంకరించబడిన ఒక గాడిదను తెచ్చి, అల్లుడిని దానిపై కూర్చోబెట్టి గ్రామం మొత్తం చుట్టి తీసుకెళ్తూ చాలాసార్లు హోలీ ఆడారు.

ఈ సంప్రదాయాన్ని ఆనందరావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ప్రారంభించాడని నమ్ముతారు. గ్రామంలో అతనికి గొప్ప గౌరవం ఉండేది. ఈ సంప్రదాయాన్ని ఆనందరావు అల్లుడు ప్రారంభించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతోంది. ఈ సంప్రదాయంలో కొత్త అల్లుడికి గ్రామస్తులు అనేక రకాల బహుమతులతో పాటు, అల్లుడికి నచ్చిన బట్టలు కూడా ఇస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us