AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు! ఆపరేషన్ D అమలు చేస్తున్న రెస్క్యూ బృందాలు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ 14వ రోజుకు చేరుకుంది. రెస్క్యూ బృందాలు 'ఆపరేషన్ డీ'ని అమలు చేస్తున్నాయి. కేరళకు చెందిన రెండు డాగ్ స్క్వాడ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది, ఇది మరింత వేగవంతమైన తవ్వకాలకు దోహదం చేస్తుంది.

SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు! ఆపరేషన్ D అమలు చేస్తున్న రెస్క్యూ బృందాలు
SLBC Tunnel
SN Pasha
|

Updated on: Mar 07, 2025 | 10:06 AM

Share

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ 14వ రోజుకు చేరుకుంది. మొత్తం 8 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే 14వ రోజు సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు ఆపరేషన్ డీ అమలు చేస్తున్నాయి. గల్లంతయిన 8 మంది ఆచూకీ కోసం టన్నల్ లోపల కేరళకు చెందిన రెండు డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. మట్టిలో చిక్కుకున్న వారిని బురదలో కూరుకుపోయిన మృదేహాలను వాసన పసికట్టి గుర్తుపట్టడంలో ఈ జాగిలాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాయి.

కేరళ వాయినాడ్ వరదల సమయంలో చిక్కుకున్న వారిని, బురదలో కూరుకుపోయిన మృదేహాలను పసిగట్టడంలో కీలక పాత్ర పోషించాయి ఈ క్యాడ వర్ జాగిలాలు. 20 అడుగుల లోపల ఉన్న వ్యక్తులను, మృతదేహాలను వారిని గుర్తించడం వీటి ప్రత్యేకత. ఇక మరో కీలక అప్డేట్‌ ఏంటంటే.. నేటి కన్వర్ బెల్ట్ మిషన్ పూర్తి స్థాయిలో అందుబాలోకి రానుంది. కాగా ఈ ప్రమాదం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకోగా.. 13.5 కిలోమీటర్ వరకు కన్వేర్ బెల్ట్ సింగరేణి, జీపీ కంపెనీ ఇంజనీర్లు రీస్టార్ట్‌ చేశారు. కన్వేర్‌ బెల్ట్‌ స్టార్ట్‌ కావడంతో నేటి నుంచి మినీ ప్రోక్లైనర్‌తో మట్టి తవ్వకాలు జరిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత 13 రోజులుగా మాన్యువల్‌గానే ఈ తవ్వకాలు చేపట్టారు. GPR మిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: SLBC Tunnel Recue operation: కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.