BRS: పార్టీ బలోపేతంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు.!
గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఈసారి మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత అసెంబ్లీకి వస్తోన్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీ బలోపేతంపై BRS అధినేత కేసీఆర్ ప్లాన్ ఏంటి..? ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించబోతున్నారా..? ఇవాళ్టి భేటీలో ఏఏ అంశాలపై చర్చిస్తారు..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపబోతున్నారు..? గులాబీ బాస్ గేర్ మార్చబోతున్నారు. పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలని నిర్ణయించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనంటూ గత నెలలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా చెప్పారు. అందులో భాగంగా ప్రతి వారంలో ఒక రోజు ఒకటి, రెండు నియోజకవర్గాలకు సంబంధించిన 200 మందితో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫౌమ్‌హౌస్‌లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఈసారి మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత అసెంబ్లీకి వస్తోన్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలు రావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చిస్తారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక్క ఎమ్మెల్సీని BRS పార్టీ గెలిచే అవకాశం ఉంది. అయితే అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే పలువురు నేతలతో చర్చించిన కేసీఆర్.. ఇవాళ్టి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
