AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telanana: ఆస్తి కోసం బంధువుల అమానుషం.. 36 గంటల తర్వాత వృద్ధురాలికి అంత్యక్రియలు

ఆ ఊర్లో మానవత్వ మంటగలిసింది. వారసులు లేని ఓ వృద్ధురాలు మరణిస్తే బంధువులు దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహిచవల్సింది పోయి దారుణానికి ఒడిగ్గారు. ఆస్తి కోసం దాడులకు దిగారు. దీంతో వృద్ధురాలి మృతదేహానికి 36 గంటలపాటు అంత్యక్రియలు జరపకుండా అడ్డుకున్నారు. చనిపోయి శవాన్ని ఇంటిముందు సుమారు ఒకటిన్నర దినం ఉంచి ఆస్తి పంపకాలు జరిగిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ..

Telanana: ఆస్తి కోసం బంధువుల అమానుషం.. 36 గంటల తర్వాత వృద్ధురాలికి అంత్యక్రియలు
Property Disputes In Kamareddy
Prabhakar M
| Edited By: Srilakshmi C|

Updated on: Mar 29, 2024 | 10:35 AM

Share

కామారెడ్డి, మార్చి 28: ఆ ఊర్లో మానవత్వ మంటగలిసింది. వారసులు లేని ఓ వృద్ధురాలు మరణిస్తే బంధువులు దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహిచవల్సింది పోయి దారుణానికి ఒడిగ్గారు. ఆస్తి కోసం దాడులకు దిగారు. దీంతో వృద్ధురాలి మృతదేహానికి 36 గంటలపాటు అంత్యక్రియలు జరపకుండా అడ్డుకున్నారు. చనిపోయి శవాన్ని ఇంటిముందు సుమారు ఒకటిన్నర దినం ఉంచి ఆస్తి పంపకాలు జరిగిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ అంత్యక్రియలకు అడ్డుపడ్డారు. అడ్డుపడి ఓ వ్యక్తిపై తల్వార్‌తో దాడి చేశాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన చింతల కృష్ణవ్వ (55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. కృష్ణవ్వ పేరిట గ్రామంలో 3 ఎకరాల (40 గుంటల భూమి) వ్యవసాయ భూమితో పాటు, ఒక ఇల్లు ఉంది. మృతురాలి భర్త అనారోగ్యంతో దీంతో మృతురాలికి సంతానం లేకపోవడంతో బంధువులు అంత్యక్రియలను ఏర్పాట్లు చేశారు. ఆస్తి పంపకాలు జరిగిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి మరిది మైసయ్య భార్య, కొడుకు రవీందర్ బంధువులతో గొడవపడ్డారు. కిష్టవ్వకు తామే సపర్యలు చేశామని, అంత్యక్రియలు తామే చేస్తామని ఆమె చెల్లెలి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. మరోవైపు తమకు రూ.2 లక్షలు ఇస్తేనే దహన సంస్కారాలు చేయడానికి అనుమతిస్తామని కిష్టవ్వ మరిది మైసయ్య కుటుంబీకులు పట్టుబట్టారు.

దీంతో బంధువులకు, మృతురాలి మరిది కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. పంచాయతీ నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రవీందర్ ఇంట్లో నుంచి తల్వార్ తీసుకువచ్చి మృతురాలి చెల్లె కొడుకు అయినా నర్సింలుపై దాడి చేశాడు. ఈ దాడిలో భుజం పైన చేతివేళ్లపైన దాడి చేయడంతో రెండు చేతి వేళ్ళు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పొలీసులు చేరుకొని గొడవను సద్దుమణిగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అంతక్రియలను పూర్తి చేశారు. గురువారం ఉదయం మొదలైన ఈ గొడవ ఉద్రిక్తతతకు దారి తీసిన ఈ గొడవ గురువారం రాత్రి కిష్టవ్వ దహన సంస్కారాలతో సర్దు మనిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.