KTR: కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. పోరాట పంథాలో కదం తొక్కుదాం: కేటీఆర్

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ వార్ షురూ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి పలువురు నాయకుల చేరిక హాట్ టాపిక్ గా మారింది. పట్నం దంపతులు, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరిన కొన్నాళ్లకే కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

KTR: కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. పోరాట పంథాలో కదం తొక్కుదాం: కేటీఆర్
KCR KTR
Follow us

|

Updated on: Mar 29, 2024 | 11:18 AM

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ వార్ షురూ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి పలువురు నాయకుల చేరిక హాట్ టాపిక్ గా మారింది. పట్నం దంపతులు, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరిన కొన్నాళ్లకే కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలోనే.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కు లేఖ రాసిన కావ్య.. ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్.. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించారు. ఆ మరుక్షణమే.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు.. ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపేందుకు తండ్రి కడియం శ్రీహరితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అన్ని బాగుంటే.. వరంగల్ ఎంపీ టికెట్ కడియం శ్రీహరి కూతురుకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.. అయితే, ఈ పరిణామాలన్నీ గులాబీ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ తరుణంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్.. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్.. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCRను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో