AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress MP Candidate: ఖరారు కానీ కరీంనగర్ కాంగ్రెస్ ‌అభ్యర్థి.. తెరపైకి మరో కొత్త పేరు!

కరీంనగర్ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీలో ఉత్కంట కొనసాగుతోంది. అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారుయ్యారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది.

Congress MP Candidate: ఖరారు కానీ కరీంనగర్ కాంగ్రెస్ ‌అభ్యర్థి.. తెరపైకి మరో కొత్త పేరు!
Karimnagar Congress
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 29, 2024 | 12:43 PM

Share

కరీంనగర్ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీలో ఉత్కంట కొనసాగుతోంది. అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారుయ్యారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది.

ఇప్పుడు ‌అందరి‌ దృష్టి కరీంనగర్ ‌పార్లమెంట్ నియోజకవర్గంపై‌నే ఉంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో ఈ ప్రాంతమే కీలకపాత్ర పోషించింది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి ‌సారించాయి. బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ‌వినోద్‌ కుమార్ బరిలోకి‌ దిగుతున్నారు. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అయితే రెండవ జాబితాలోనే కాంగ్రెస్ ‌అభ్యర్థిని ఖరారు చేస్తారని‌ ప్రచారం సాగింది. కానీ‌ చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ ‌హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ‌ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు టికెట్ కోసం‌ తీవ్రంగా ‌ప్రయత్నాలు చేస్తున్నారట. తాజాగా తీన్మార్ మల్లన్న పేరు తెర పైకి వచ్చింది. నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో ఇక్కడ మరో అభ్యర్థికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కరీంనగర్ సెగ్మెంట్ నుంచి రెడ్డి అభ్యర్థి కాకుండా, బీసీ అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. పార్లమెంటు నియోజకవర్గ ‌ఇంచార్జ్‌గా‌ వ్యవహారిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆశావహులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎలాగైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ‌చేరికలను ప్రోత్సహిస్తోంది. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేయడంతో.. ఇక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే ప్రచారం సాగుతుంది. ఇక.. రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న మధ్యనే టికెట్ ఫైట్ కొనసాగుతుంది..!

మిగితా పార్లమెంటు ‌స్థానాలతో పోలిస్తే కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఈ రెండు‌ పార్టీలని ఎదుర్కోవాలంటే బలమైనా అభ్యర్థి కావాలి. అంతే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ ‌అభ్యర్థులు ఒకదఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ‌క్యాండెట్‌ను ప్రకటించడంతో‌ పాటు ప్రచారంలో కూడా దూకుడు‌ పెంచాల్సి అవసం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అభ్యర్థి ‌ప్రకటన అలస్యం కావడంతో‌ కరీంనగర్ కాంగ్రెస్ ‌క్యాడర్‌ కూడా అయోమయానికి గురి‌ అవుతుంది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ‌ సెగ్మెంట్ పై దృష్టి పెట్టి స్థానిక‌ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మొన్నటి విడత లో కరీంనగర్ అభ్యర్థిని ఖరారు చేస్తారనే భావించారు. కానీ.. అభ్యర్థిని ప్రకటించలేదు. టికెట్ కేటాయింపులో ఆలస్యం అయిన కొద్దీ ఇబ్బందులు పెరుగుతున్నాయని క్యాడర్ బహిరంగంగానే చెబుతున్నారట. నెక్స్ట్ జాబితాలోనైనా కరీంనగర్ పేరు ఉంటుందో.. లేదో అనే చర్చ సాగుతుంది..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…