AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్‌ కార్డుదారులకు బిగ్ అప్‌డేట్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్డులలో కొత్త పేర్లు చేర్చడానికి పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దాంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తోంది.

Telangana: రేషన్‌ కార్డుదారులకు బిగ్ అప్‌డేట్
Ration Cards
Prabhakar M
| Edited By: |

Updated on: May 03, 2025 | 8:22 AM

Share

తెలంగాణలో పేదల ఇంట మే నెల రేషన్ పండుగను తీసుకొచ్చింది. కొత్తగా 11 లక్షల మందికి పైగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు రేషన్ పొందే వారి సంఖ్య 2.93 కోట్లకు చేరుకుంది. ఈసారి ప్రభుత్వం పరిశీలన చేసి అర్హులైన వారికి కొత్త కార్డులు జారీ చేసింది.

కొత్త కార్డులకు గ్రీన్ సిగ్నల్

తాజా గణాంకాల ప్రకారం 31,084 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటి ద్వారా 93,584 మంది సభ్యులు లబ్ధిదారులుగా గుర్తింపు పొందారు. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్లు చేరాయి. ఈ మేరకు అధికారుల ద్వారా కార్డుల జారీ, సభ్యుల చేర్పు ప్రక్రియ పూర్తయింది.

బియ్యం సరఫరాలో పెరుగుదల

రాష్ట్రంలో రేషన్ బియ్యం కోటా కూడా తగినట్లుగానే పెరిగింది. జనవరిలో 1.79 లక్షల టన్నులుగా ఉన్న బియ్యం కోటా, మే నెల నాటికి 1.86 లక్షల టన్నులకు చేరింది. కొత్త లబ్ధిదారుల అవసరాల కోసం అదనంగా 4,431 టన్నుల బియ్యాన్ని అధికారులు సరఫరా చేస్తున్నారు.

పాత కార్డుల్లో కొత్త చేర్పులు – కొన్ని తొలగింపులు

జనవరి నుంచి మే మధ్యలో ప్రభుత్వం 19 లక్షలకు పైగా లబ్ధిదారులను కొత్తగా గుర్తించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల 7 లక్షలకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్నవాళ్లు వివాహం తర్వాత వేరుగా ఉండటంతో కార్డుల్లో మార్పులు జరిగాయి. చివరికి నికరంగా 12 లక్షల మందికి కొత్తగా రేషన్ అందనుంది.

మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల తుది పరిశీలన

ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా మూడు లక్షల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు వాటిని దశలవారీగా పరిశీలిస్తున్నారు. భర్త, భార్య వేర్వేరు కార్డుల్లో ఉన్నవారికి ఒక్కటిగా చేయడం, కొత్తగా పిల్లలను చేర్చడం వంటి ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!