Telangana: రిమోట్ ఓటింగ్ విధానం అవసరం లేదు.. ఈ విధానాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది.. వినోద్ కుమార్..
రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని తెలంగాణ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్...
రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని తెలంగాణ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని పక్కన పెడుతున్నాయన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీగా తాము రిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారనే అనుమానాలు, ప్రచారాలు బలంగా ఉన్నాయని చెప్పారు. వాటినే ఈసీ ఇప్పటి వరకు నివృత్తి చేయలేదని.. అలాంటప్పుడు మల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తామని సవాల్ విసిరారు.
రిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీలో చర్చించి ఈ నెల 30 లోగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా తెలుపుతాం. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కన పెట్టాయి. అలాంటప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా నమ్మగలం?. అక్కడి నుంచి ఆ ఓటరే ఓటు వేస్తున్నాడా? వేరెవరైనా వేస్తున్నారో తెలుసుకోవడం ఎలా?’’
వినోద్ కుమార్, తెలంగాణ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు
నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విషయాలు బయటకు వస్తున్నాయని.. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా నమ్మగలమని నిలదీశారు. అక్కడి నుంచి ఆ ఓటరే ఓటు వేస్తున్నాడా..? హ్యాక్ చేస్తున్నారా..? ఎలా తెలుసుకోగలమో చెప్పలేమని, దీంతో రిమోట్ విధానం తెలంగాణలకు అవసరం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం