Sankranti: అనుభూతులను మూటగట్టుకుని.. పట్నానికి పయనమైన పల్లె.. హైవేలపై పెరుగుతున్న రద్దీ..
తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి.. మూడు రోజుల సంబరాల మధ్య ఘనంగా ముగిసింది. భోగీ, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో చిన్నాపెద్దా ఆనందంతో ఊగిపోయారు. పట్నం నుంచి సొంతూళ్లకు వెళ్లిన...
తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి.. మూడు రోజుల సంబరాల మధ్య ఘనంగా ముగిసింది. భోగీ, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో చిన్నాపెద్దా ఆనందంతో ఊగిపోయారు. పట్నం నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారు పండుగ మురిపెం తీరడంతో నగరానికి పరుగులు తీస్తున్నారు. స్నేహితుల పలకరింపులు.. అత్తింటివారి ఆత్మీయతలు.. తల్లిదండ్రుల అనురాగాలు.. ఊరి ప్రజల ప్రేమాభిమానాలు. పచ్చని పంట పొలాలు, పాత జ్ఞాపకాలు. ఇలా ఎన్నో అనుభూతులను మూటగట్టుకుని మహానగరానికి చేరుకుంటున్నారు. మూడు రోజుల పండగ సమయాలను మనసులో నిక్షిప్తం చేసుకుని తిరిగి పట్నానికి పయనమవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాలు బారులు తీరాయి. భారీగా వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.
కాగా.. సంక్రాంతి సందర్భంగా యాదాద్రి జిల్లాలోని హైవేలు బిజీగా మారాయి. హైదరాబాద్ – విజయవాడ హైవే పై 67,577 వాహనాలు, హైదరాబాద్ – వరంగల్ హైవే పై 25,231 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 13న రెండు హైవేలపై కలుపుకొని మొత్తం 92,808 వాహనాలు ప్రయాణించాయి. ఈ లెక్కన శుక్రవారం రోజున ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ వెహికిల్స్ఈ హైవేల మీదుగా వెళ్లాయి. విజయవాడ హైవే మీదుగా నిమిషానికి 46 వెహికల్స్ప్రయాణించగా, వరంగల్ హైవేపై నిమిషానికి 18 వెహికల్స్ రాకపోకలు సాగించాయి.
మరోవైపు.. సంక్రాంతి ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌సిటీ రోడ్లు బోసిపోయాయి. నగరవాసులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పంజాగుట్ట, కోఠి, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని రోడ్లు ఖాళీగా కనిపించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం