Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ఫైర్..

Telangana Congress: రైతుల ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతోనైనా

Telangana Congress: ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ఫైర్..
Revanth Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 19, 2021 | 10:03 PM

Telangana Congress: రైతుల ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతోనైనా ధాన్యం కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త రైతు చట్టాల రద్దు రైతుల విజయమేనని చెప్పారు. ధాన్యం వివాదాన్ని పార్లమెంటు వేదికగా నిలదీస్తామని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ‘కల్లాల్లోకి కాంగ్రెస్’ కార్యక్రమంలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లా సరిహద్దుల్లో బస్వాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ కు ఘనస్వాగతం పలికారు. బిక్నూర్, కామారెడ్డి మాచారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్ మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. కల్లాల్లో, రోడ్లపై కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించారు.

వర్షం కారణంగా వడ్లు తడిసి పుట్టెడు దుఃఖం లో ఉన్న రైతులను ఓదార్చారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరు, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్ద ఉంటున్నామని, కొనుగోళ్లలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని రైతులు.. రేవంత్ కు వివరించారు. వద్దంటే వరిపంట సాగు చేశారని రైతులపై కేసీఆర్ కక్ష గట్టారని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ లు నాటకాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. యూపీ ఎన్నికల కోసమే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందని అన్నారు. ప్రాణాలు పోయిన రైతు కుటుంబాలకు మోదీ క్షమాపణ చెప్పాలని, రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also read:

Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్….