Revanth Reddy: దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు.. ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్
దళిత సోదరులకు అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంద్రవెల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా మోగించింది.

Congress Indravelli Dalitha Girijana Dandora: దళిత సోదరులకు అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంద్రవెల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా మోగించింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన వారి కోసం భారీ స్థూపాన్ని నిర్మాస్తామన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఉద్యమకారుని పేరును శిలాఫలకం మీద చెక్కిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి.. దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. నాటి రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ దగ్గర నుంచి నేటి వరకు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని కీలక పదవుల్లో ఉంచినట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే… ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు.
దళిత, గిరిజన దండోరా సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశయాలను కేసీఆర్ ఏనాడో తొక్కేశారని మండిపడ్డారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు. దళిత బంధులాగే ఎస్టీలకు కూడా ఒక పథకం అమలు చేయాలన్నారు.
Read Also…. Chiranjeevi: “మా “లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ
