AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Paddy:: ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ ద్వంద్య వైఖరి.. ముఖ్యమంత్రిపై మండిపడ్డ బండి సంజయ్‌..

Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో అడుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

Telangana Paddy:: ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ ద్వంద్య వైఖరి.. ముఖ్యమంత్రిపై మండిపడ్డ బండి సంజయ్‌..
Basha Shek
|

Updated on: Mar 24, 2022 | 6:10 AM

Share

Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో అడుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కేసీఆర్ (CM KCR) సర్కార్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ ధాన్యం కొనుగోలు అంశంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. బాయిల్డ్ రైస్ ఇక రాష్ట్రం నుండి పంపించమని కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? అని దుయ్యబట్టారు. కేంద్రం మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చుస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనాలి లేని పక్షంలో బీజేపీ రైతుల పక్షాన ఉద్యమిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రైతులతో రాజకీయం చేస్తే ఊరుకోం..

‘వరి వేస్తే ఉరి అని చెప్పి రైతుల జీవితాలతో ఆటలు అడుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? వరి వేస్తే ఉరి అంటేనే హుజురాబాద్ ప్రజలు మీకు బుద్ధి చెప్పింది వాస్తవం కాదా కేసీఆర్? కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తాను అని చెప్పింది మీరే కదా కేసీఆర్? ఇప్పుడు పంటలు కోత కు వచ్చాయని ఆ నెపం కేంద్రం మీద నెట్టాలని చూస్తున్నారా?’ అని కేసీఆర్ పై మండిపడ్డారు బండి సంజయ్‌ .కేంద్రం ధాన్యం కొనదు? అని ఎప్పుడైన చెప్పిందా అని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉన్న కేంద్రానికి ధాన్యం ఇవ్వనని రైతుల పట్ల కక్షపురితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా కోట్ల రూపాయలకు సీఎం కేసీఆర్ ఎక్కడ అమ్ముకుంటూన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకొదని ఆయన హెచ్చరించారు.

Also Read:Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్‌ అలజడి.. అప్రమత్తమైన రాష్ట్రాలు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

CM KCR: యాసంగిలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..